Strawberry Facts

 

 

With the onset of summer the strawberry supplies will soon fade so this is the best time to eat these luscious berries for health and vigour.


Eight fresh strawberries contain only 50 calories and 3 grams of soluble fiber. They’re brimming with antioxidants like vitamin C and anthocyanins which also give berries their gorgeous red and blue colors. According to a recently-published report in the American Journal of Clinical Nutrition, strawberries ranked third on a list of more than 1,000 foods antioxidant-rich foods. Only blackberries and walnuts have more.

Also According to a 2011 study conducted at Ohio State University, strawberries may also play a role in preventing colon and esophageal cancer although the study was done on mice.

Fun Ideas

These red beauties are versatile and can be used in both sweet and savory dishes. Here are some creative ways to use them:

    Use as a substitute for tomatoes in a recipe for salad or salsa
    Toss sliced berries onto a bed of green leafy salad
    Substitute pureed strawberries for part or all of the vinegar in a salad dressing
    Freeze whole strawberries and use as “ice cubes” in cocktails

Vitamin C is proven to keep the heart healthy and the body’s immune system strong. A healthy heart and a strong immune system is the perfect way to a healthy body. The strawberry is also rich in folic acid, potassium and fiber, other nutrients that the body needs.

So, whether a girl/guy is in love or seeking love, or is happy with loving him/ herself, strawberries are definitely  the order for the day. Strawberries are truly the fruits of love.

 

సమయానికి తినకపోతే ఈ సమస్య రావడం పక్కా..!

ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  తీసుకునే ఆహారం వల్లనే శరీరానికి శక్తి వస్తుంది. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్,  కాల్షియం,  ఫైబర్, ఖనిజాలు చాలా అవసరం.  ఇవన్నీ ఆహారంలో ఉండటం ఎంత ముఖ్యమూ. ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం.  అందుకే ఆరోగ్య నిపుణులు కూడా సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతారు. అలా చేయకపోతే జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. కేవలం జీవక్రియ ప్రభావితం  కావడమే కాదు.. సమయానికి ఆహారం తీసుకోకపోతే అది చాలా తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుందట.  సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగేదేంటో తెలుసుకుంటే..  మైగ్రేన్.. ఆహారం సమయానికి తీసుకోకపోతే  అది తలనొప్పి సమస్యగా మారుతుందట.  మరీ ముఖ్యంగా ఈ తలనొప్పి కాస్తా మైగ్రేన్ గా మారే అవకాశం ఉంటుందట. మైగ్రేన్ చాలా తీవ్రమైన తలనొప్పికి కారణం అవుతుంది.  ఆహారం సమయానికి తీసుకోకపోతే ఇది వారంలో రెండు నుండి మూడు రోజులు మైగ్రేన్ కారణంగా బాధపడాల్సి ఉంటుందని ఆహార నిపుణులు, వైద్యులు అంటున్నారు. మైగ్రేన్ వల్ల జరిగేది ఇదే.. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల వచ్చే మైగ్రేన్ నొప్పి ఒక రోజు మాత్రమే ఉంటుందట.  కానీ దానివల్ల ఏకాగ్రత లేకపోవడం, దృష్టి లేకపోవడం, అలసట,  బలహీనత  మైగ్రేన్ ప్రభావాన్ని మరింత పెంచుతాయి.  దీని కారణంగా మైగ్రేన్ తరువాత  రెండు మూడు రోజులు ఏ పనిని ఏకాగ్రతగా చేయలేరు.. . సమయానికి తినాలి.. జాగ్రత్తగా, సమయానికి  తినడం వల్ల తలనొప్పి, దాని వల్ల కలిగే  దుష్ప్రభావాలను నివారించవచ్చు. అందుకే ఎన్ని పనులున్నా సమయానికి ఆహారం తినడాన్ని విస్మరించకూడదు. పెద్దవారు ఉదయం ఆఫీసుకు వెళ్ళేముందు,  పనికి వెళ్ళేముందు తినడం తప్పనిసరి.. అలాగే పిల్లలకు కూడా తప్పనిసరిగా పాఠశాలకు వెళ్ళేముందు ఆహారం పెట్టాలి.  ఎక్కువ సేపు టీవి, ఫోన్, కంప్యూటర్ వంటివి చూడటం వల్ల పిల్లలలోనూ, పెద్దలలోనూ తలనొప్పి, మైగ్రేన్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఆహారం దగ్గర నిర్లక్ష్యం చేయకూడదు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఎక్కువగా చలిగా అనిపిస్తూ ఉంటుందా.. ఇదే అసలు కారణం!

చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.  మందం పాటి దుస్తులు దరించినా,  స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది.  అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని అంటున్నారు  వైద్యులు.  అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే.. మానవ శరీరంలో  అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సంక్లిష్టమైన థర్మోర్గ్యులేషన్ వ్యవస్థను ఉపయోగించబడుతుంది. ఇది ప్రతి శరీరం దానికదే నిర్వహించుకుంటుంది. దీనికి నిర్దిష్ట విటమిన్లు,  ఖనిజాలు అవసరం. శరీరంలో ఈ పోషకాలు లోపించినప్పుడు రక్త ప్రసరణ ప్రభావితమవుతుంది,  జీవక్రియ మందగిస్తుంది. దీని వలన శరీరం తగినంత వేడిని ఉత్పత్తి చేయకపోవడం జరిగవచ్చు.  ఇలా జరిగితే మనిషిలో  సాధారణం కంటే చల్లగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది చాలా వరకు రక్తహీనత లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో వేడిగా ఉండటానికి ఇంటి వాతావరణాన్ని వెచ్చగా ఉంచడం కంటే తినే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవడం మంచిదని అంటున్నారు వైద్యులు. అంతేకాదు.. కొన్ని పోషకాలు కూడా చలి ఎక్కువ కలగడానికి కారణం అవుతాయట. ఐరన్,  విటమిన్-బి12 లోపం.. చాలా చల్లగా అనిపించడానికి అత్యంత సాధారణ కారణం ఐరన్  లోపమట. ఐరన్ బాగుంటేనే  హిమోగ్లోబిన్‌ మెరుగ్గా ఉంటుంది. ఇది కణాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. అదే ఐరన్ లోపిస్తే ఆక్సిజన్ సరఫరా లోపించి చలి పెరగడానికి దారి తీస్తుంది.   విటమిన్ బి12 లోపం నరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చేతులు,  కాళ్ళు తిమ్మిరిగా ఉండటం,  చల్లగా ఉండటం జరుగుతుంది. మెగ్నీషియం,  ఫోలేట్ కూడా కండరాల సంకోచం,  శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి అవసరమైన శక్తిని  ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చలి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే.. అకస్మాత్తుగా చాలా చలిగా అనిపిస్తే కాస్త  వ్యాయామం చేయడం మంచిది.  లేదంటే శరీరాన్ని  సాగదీయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. శారీరక శ్రమ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది శరీరాన్ని వెంటనే వేడి చేస్తుంది. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా అల్లం టీ తాగవచ్చు. అయితే అల్లం టీ ఖాళీ కడుపుతో తాగకూడదు. ఆహారంలో మార్పులు.. శరీరం వెచ్చగా ఉండటానికి  ఆహారంలో బెల్లం, వేరుశనగ, ఖర్జూరం,  మిల్లెట్ వంటి వెచ్చని ఆహారాలను చేర్చుకోవాలి. వెల్లుల్లి,  అల్లం తీసుకోవడం పెంచాలి.  ఇవి రక్త నాళాలను విస్తరిస్తాయి,  రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.  ఆహారం తీసుకున్నప్పటికీ సమస్య కొనసాగితే, వైద్యుడిని సంప్రదించి,  వైద్యుల సలహా మేరకు మందులు లేదా చికిత్స తీసుకోవడం మంచిది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

బ్రేక్ఫాస్ట్ విషయంలో ఈ మిస్టేక్స్ చేశారంటే మీ బాడీ డ్యామేజ్ ని ఎవరూ ఆపలేరు..!

అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం.  ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతుంటారు.  అందుకే అల్పాహారం ఆరోగ్యకరంగా, పోషకాలతో నిండి ఉండాలని కూడా చెబుతారు.  అందరూ ఒకే విధమైన బ్రేక్పాస్ట్ తీసుకోరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆహారం బ్రేక్పాస్ట్ లో తీసుకోవడం అలవాటుగా ఉంటుంది.  అయితే బ్రేక్పాస్ట్ విషయంలో చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల టోటల్ గా బాడీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా చెబుతున్నారు. ఇంతకీ బ్రేక్ పాస్ట్ విషయంలో అస్సలు చేయకూడని మిస్టేక్స్ ఏంటి? అసలు బ్రేక్పాస్ట్ చేయడం వల్ల జరిగే మేలు ఏంటి? తెలుసుకుంటే.. బ్రేక్పాస్ట్ ప్రయోజనం.. అల్పాహారం లేదా బ్రేక్పాస్ట్  రోజులో మొదటగా తీసుకునే ఆహారం.  ఇది రోజంతా శక్తివంతంగా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. జీవక్తియ రోజంతా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ కారణంగా ఉదయాన్నే సరైన బ్రేక్పాస్ట్ చేయడం కూడా చాలా ముఖ్యంగా పరిగణించబడుతుంది. బ్రేక్పాస్ట్ విషయంలో చేసే తప్పులు.. ఖాళీ కడుపుతో టీ.. ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటే ఇది చాలా పెద్ద మిస్టేక్ అంటున్నారు వైద్యులు.  ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆమ్లత్వం పెరుగుతుంది కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయని, డీహైడ్రేషన్‌కు కారణమవుతుందని,  ఆకలి కూడా  తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. చపాతీ, పరాటా.. మీరు ప్రతిరోజూ బ్రేక్పాస్ లో చపాతీలు లేదా  పరాటాలు  తింటే  ఉదయాన్నే ఎక్కువ  కార్బోహైడ్రేట్లను తీసుకోవడానికి కారణం అవుతుంది. ఇది ప్రోటీన్ లోపానికి కూడా దారితీస్తుంది. ఉదయాన్నే చపాతీలు లేదా పరాటాలు తినడం వల్ల  కడుపు నిండినట్టు అనిపిస్తుంది  కానీ ఇది ఇన్సులిన్ స్పైక్‌కు కారణమవుతుందట.  మధ్యాహ్నం  తీసుకునే ఆహారం వల్ల  మరింత హెవీగా  మారుతుందని ఇది శరీరాన్ని బరువుగా ,  పనుల మీద ఆసక్తి మరల్చేలా మారుస్తుందని చెబుతున్నారు. ఇన్స్టంట్ ఓట్స్..  అల్పాహారంలో చాలామంది  ఇన్‌స్టంట్ ఓట్స్ తింటుంటారు.  ఇది చాలా ఆరోగ్యకరమని కూడా అనుకుంటారు. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిదని కూడా అనుకుంటారు.  కానీ ఈ ఓట్స్  అధికంగా ప్రాసెస్ చేసి ఉంటారు. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది. బరువు తగ్గడానికి దీనిని తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. టీ తో బిస్కెట్,  జ్యూస్.. ఉదయాన్నే  టీతో పాటు బిస్కెట్లు లేదా జ్యూస్‌లు తీసుకోవడం చాలా మందికి అలవాటు.  దీన్నే బ్రేక్పాస్ట్ గా సరిపేట్టేస్తుంటారు కూడా. అయితే వీటిలో శుద్ధి చేసిన పిండి, చక్కెర,  ట్రాన్స్ ఫ్యాట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్పైక్‌లకు కారణమవుతాయి,  ఊబకాయాన్ని పెంచుతాయి. బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తే.. చాలామంది డైటింగ్ పేరుతో ఉదయాన్నే బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తుంటారు.  బరువు తగ్గాలనే తాపత్రయంతో బ్రేక్పాస్ట్ స్కిప్ చేసి నేరుగా  బోజనం చేస్తుంటారు.  కానీ ఇది సరైన పద్దతి కాదని వైద్యులు చెబుతున్నారు.  బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తే జీవక్రియ మందగిస్తుందట. ఉదయం బ్రేక్పాస్ట్ స్కిప్ చేసే చాలామంది ఉదయం సమయంలో బిస్కెట్లు, జంగ్ ఫుడ్స్, ఇన్స్టంట్ డ్రింక్స్, ఇన్స్టంట్ ఫుడ్స్ తింటుంటారు. పైగా అవి చాలా లైట్ ఫుడ్స్ అని కూడా అనుకుంటారు.  ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

రెడీ టూ యూజ్ ఫుడ్స్.. ఈ నిజం తెలిస్తే అస్సలు ముట్టరు..!

ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు.  సమయాభావం కారణంగా చాలా సార్లు వండుకోవడం కష్టంగా మారుతుంది.  ఇలాంటి సందర్బాలలో బయట ఆహారం తినాలని  అనుకున్నా అవి ఖర్చుతో కూడుకుని ఉండటం తో వాటి వైపు వెళ్లాలన్నా కూడా భయపడతారు. ఇలాంటి వాళ్లను టార్గెట్ చేసుకుని వచ్చినవే ప్యాకేజ్డ్ ఫుడ్స్.. వీటిలో రెడీ టూ యూజ్  ఫుడ్స్ చాలా ఉంటున్నాయి.  సింపుల్ గా వేడి నీరు పోయడం లేదా వేడి చేయడం ద్వారా నిమిషాలలో ఆహారం రెడీ అవుతుంది.  పైగా మంచి మసాలాలతో రుచిగా ఉండటంతో రెడీ టూ యూజ్  పుడ్స్ కు మంచి డిమాండ్ కూడా ఉంది.  చిన్న పిల్లలు,  యువత ఎక్కువగా ఈ రెడీ టూ యూజ్ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు.  అయితే ఈ ఫుడ్స్ గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అసలు రెడీ టు యూజ్ ఫుడ్స్ అంత రుచిగా ఎందుకుంటాయి? వీటిని తినడం వల్ల కలిగే ప్రమాదం ఏంటి? తెలుసుకుంటే.. రెడీ టూ యూజ్ ఫుడ్స్.. అల్యూమినియం సాల్ట్.. సాధారణంగా రెఢీ టూ యూజ్ ఫుడ్స్ అన్నీ ప్యాక్డ్ ఫుడ్స్ గానే ఉంటాయి. ఈ ప్యాక్స్ లోని ఆహారాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా వాటిలో హానికర రసాయనాలు కలుపుతారు. మరీ ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే కారం, పసుపు, మసాలలో అల్యూమినియం సాల్ట్స్ ను కలుపుతున్నారు. వీటివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని,  వీటిని వాడటం వల్ల చిన్నపిల్లలు , వృద్దులు,  అప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెడీ టు యూజ్ ఫుడ్స్ తో వచ్చే వ్యాధులు.. రెడీ టూ యూజ్ ఫుడ్స్ లో ఆలమ్ స్పైస్ కలుపుతారు.  ఇది కలిపిన మసాలాలు ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని నరాల బలహీనత, మతిమరుపు లాంటి సమస్యలు వస్తున్నాయి.  50ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు రావడం ఈ ఆలమ్ స్పైస్ వాడటం వల్లే అని స్పష్టం చేస్తున్నారు. అసలేంటీ ఆలమ్ స్పైస్..   అల్యూమినియం సాల్ట్ నే ఆలమ్ స్పైస్ అని అంటారు. అల్యూమినియం పొటాషియం సల్పేట్ నే అల్యూమినియం సాల్ట్ అని అంటారు.  మసాలా దినుసులు పాడవకుండా దీన్ని కలుపుతుంటారు. దీని వల్ల మసాలా దినులు ఎక్కువ కాలం పాటూ రుచి,  స్వభావం,  రంగు  మారకుండా పురుగులు పట్టకుండా, అలాగే మసాలాలు ఉండలు కట్టకుండా సహాయపడుతుంది. ప్యాకింగ్ ఫుడ్స్ లో దీన్ని మోతాదుకు మించి వాడుతుండటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.  అందుకే వీలైనంత వరకు మసాలా పొడులను కూడా బయటి నుండి తెచ్చుకోవడం కంటే.. ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఇనుప పాత్రలో  ఈ ఆహారాలను వండితే చాలా డేంజర్..!

ఇనుప పాత్రలలో వండిన పదార్థాలు   ఆరోగ్యానికి ఎంతో మంచివి. నాన్ స్టిక్,  అల్యూమినియం తో ఇనుప పాత్రలలో వండిన ఆహారం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  ఇనుప పాత్రలలో వంట చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఆహారంలో సహజంగా ఐరన్  ఉత్పన్నం అవుతుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి,  రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. అయితే ఇనుప పాత్రలలో వండే ప్రతి ఆహారం  ఆరోగ్యానికి మంచి చేస్తుంది అనుకుంటే పొరపాటే. కొన్ని ఆహార పదార్థాలలో ఉండే  రసాయనాలు ఐరన్ తో  చర్య జరిపి, ఆహారం రుచి,  రంగును మార్చడమే కాకుండా, ఫుడ్ పాయిజనింగ్,  చర్మ వ్యాధుల వంటి తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుంది. అందువల్ల ఏ ఆహారాలను ఇనుప పాత్రలో వండకూడదు తెలుసుకోవడం ముఖ్యం. పుల్లని ఆహారాలు.. చింతపండు, టమోటా లేదా నిమ్మకాయ వంటి పుల్లని పదార్థాలు కలిగిన గ్రేవీలను ఎప్పుడూ ఇనుప పాత్రలో ఉడికించకూడదట. ఈ పదార్థాలలో సహజ ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఇనుముతో వెంటనే రియాక్ట్ అవుతాయి. ఆహారానికి ఇనుము రుచిని ఇస్తాయి.  జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తాయి. పుల్లగా ఉండటం వల్ల ఇనుము ఆహారంలోకి ఎక్కువ మొత్తంలో లీచ్ అవుతుంది, ఇది శరీరంలో పాయిజన్ గా కూడా మారవచ్చు. పాలు, పెరుగుతో తయారు  చేసే పదార్థాలు.. పాలు, పెరుగు జోడించి తయారు చేసే ఆహారాలు,  పాయసం, కస్టర్డ్ వంటి వంటకాలను ఇనుప పాత్రలలో వండటం నిల్వ చేయడం మంచిది కాదు.    ఇనుప పాత్రలు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి, దీని వలన పెరుగు లేదా పాలు విరుగుతాయి. ఇనుము పాత్ర  ఈ తెల్లగా కనిపించే వంటకాలను నల్లగా లేదా నిస్తేజంగా మారుస్తాయి. దీని వలన వాటి రుచి,  పోషక విలువలు రెండూ ప్రభావితం అవుతాయి. రాజ్మా,  శనగలు..  తరచుగా ఇనుప పాత్రలో రాజ్మా  బీన్స్, శనగపప్పు వండుతుంటారు. ఇనుప పాత్రలు అన్ని వైపులా సమానంగా వేడెక్కవు, ఈ భారీ ధాన్యాలు కొన్ని ప్రాంతాలలో ఉడికిపోతాయి,  మరికొన్ని  తక్కువగా ఉడుకుతాయి. సరిగా ఉడకని బీన్స్ లేదా శనగపప్పు తినడం వల్ల తీవ్రమైన ఉబ్బరం,  గ్యాస్ వస్తుంది. వాటిని ప్రెజర్ కుక్కర్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కుండలో ఉడికించడం ఉత్తమం. వెనిగర్ తో చైనీస్ ఫుడ్స్.. ఈ రోజుల్లో వెనిగర్‌ను చౌ మెయిన్,  పాస్తా వంటి వంటకాల్లో  విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వెనిగర్ అనేది బలమైన ఆమ్లం.  ఇది నిమ్మకాయ, చింతపండు లాగా ఐరన్ తో చాలా తొందరగా రియాక్ట్  అవుతుంది.  ఇలా వండే ఆహారం సేఫ్ కాదు. వెనిగర్ ఉన్న ఏదైనా వంటలకు ఐరన్  కంటే నాన్-స్టిక్ లేదా స్టీల్ పాత్రలను ఎంచుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా బయట చైనీస్ ఫుడ్స్ తినేటప్పుడు వెనిగర్ వాడుతున్నారా,  ఏ పాత్రలు వాడుతున్నారు  తెలుసుకోకుండా పొరపాటున కూడా తినకండి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

తిప్పతీగ.. ఇలా వాడి చూడండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!

తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్ లాంటివి కొనడం చేస్తుంటారు. అయితే తిప్పతీగను సరైన విధానంలో వాడటం ద్వారా చాలా రకాల ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అసలు తిప్పతీగలో ఉండే పోషకాలు ఏంటి? ఇది ఏ వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది?తెలుసుకుంటే.. తిప్పతీగలో ఉండే పోషకాలు.. తిప్పతీగలో కాల్షియం,  భాస్వరం,  ఐరన్,  రాగి, మాంగనీస్,  జింక్, విటమిన్-సి,  బీటా-కెరోటిన్, ప్రోటీన్,  ఫైబర్,  కార్బోహేడ్రేట్లు, కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు అన్నీ ఉంటాయి. తిప్పతీగ ప్రయోజనాలు.. రక్తహీనత.. మహిళలలో రక్త హీనత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తిప్పతీగను తీసుకుంటే చాలా మంచి బెనిపిట్స్ ఉంటాయి.   తిప్పతీగలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది.  ఇది రక్త  నష్టాన్ని భర్తీ చేయడంలో సహాయపడుతుంది.   రోగనిరోధక శక్తి.. శీతాకాలంలో రోగనిరోధక శక్తి బాగా బలహీనం అవుతుంది. రోగనిరోధక శక్తి తిరిగి బలంగా మారడానికి, శీతాకాలపు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి రోజూ తిప్పతీగ తీసుకుంటే చాలా మంచిది.  తిప్పతీగ లోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని బలపరచడంలో సహాయపడుతుంది. పొట్ట సమస్యలు.. పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారు తిప్పతీగ వాడితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. తిప్పతీగలో ఫైబర్ కంటెంట్ మెరుగ్గా ఉంటుంది.  ఇది పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.  రోజూ తిప్ప తీగ తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులోనే స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఎముకలు.. తిప్పతీగలో కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది.  ఇది ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది.  అందుకే ప్రతి రోజూ తిప్పతీగ తీసుకుంటే కాల్షియం మెరుగ్గా అందుతుంది.  ఎముకలు బలంగా మారతాయి. తిప్పతీగతో జాగ్రత్త.. తిప్పతీగ తినడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఏదైనా మితంగా తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది.  అలాగే తిప్పతీగ కూడా పరిమితంగా తీసుకోవాలి. ఎక్కువ తిప్ప తీగ తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలకు బదులు ఆరోగ్యానికి హాని ఎదురవుతుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

సయాటికా నొప్పి ఎందుకు వస్తుంది... ఎలా వస్తుంది తెలుసా?

శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి. వీటిని శరీరమే మెల్లిగా నయం చేసుకుంటుంది.  కానీ కొన్ని నొప్పులు శరీరాన్ని చాలా ఇబ్బంది పెడతాయి.  ఎక్కువకాలం అలాగే ఉండటం, రోజు వారి చేసుకునే పనులకు ఇబ్బంది కలిగించడం వంటివి జరుగుతాయి.  ఇలాంటి వాటిలో సయాటికా నొప్పి కూడా ప్రధానమైనది. సయాటికా నొప్పి నడుము నుండి పాదాల వరకు చాలా విపరీతంగా ఉంటుంది.  ఇది కూర్చోవడం,  నిలుచోవడం, నడవడం.. ఇలా అన్ని విషయాలలోనూ ఇబ్బంది పెడుతుంది. అసలు సయాటికా నొప్పి ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది.. తెలుసుకుంటే.. సయాటికా..  సయాటికా లక్షణాలలో నడుము నుండి పాదాల వరకు నొప్పి ఉంటుంది. ఇది ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటుంది. మన శరీరంలో అతి పొడవైన నాడి అయిన సయాటిక్ నాడి వాపు లేదా కుదించబడి నొప్పిని కలిగించినప్పుడు సయాటికా నొప్పి వస్తుంది. దీనిని చాలా మంది పట్టించుకోనట్టు నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఇది  చాలా ప్రమాదకరం.  దీన్ని ముందుగానే గుర్తించగలిగే ట్రీ ట్మెంట్ ద్వారా దీన్ని చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు.  లేదంటే తీవ్రంగా మారి చాలా ఇబ్బంది పెడుతుంది. సయాటికా నొప్పి ఎలా వస్తుంది.. మన శరీరంలో అతి పొడవైన నాడి  సయాటిక్ నాడి.  ఈ నాడి  వాపు లేదా కుదించబడినప్పుడు సయాటికా నొప్పి మొదలవుతుంది. సయాటిక్ నాడి మన వెన్నెముక బేస్ వద్ద మొదలై, కలిసిపోయినప్పుడు మందంగా మారే ఐదు వేర్వేరు నరాల మూలాల కలయిక ద్వారా ఏర్పడుతుంది. ఇవి  మన శరీరం  రెండు వైపులా నడుస్తాయి. మన వెన్నెముక బేస్ నుండి మన తుంటి ద్వారా మన కాళ్ళ వెనుక వరకు విస్తరించి ఉంటాయి. సయాటికా నొప్పి లక్షణాలు.. సయాటికా నొప్పి సాధారణంగా శరీరంలోని ఒక ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా కాళ్ళు,  వీపు ప్రాంతాలలో  నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. కొంతమందిలో ఈ  నొప్పి గట్టిగా తగిలే  విద్యుత్ షాక్ లాగా అనిపిస్తుంది. కాళ్ళలో తిమ్మిరి,  బలహీనత కూడా  ఉంటుంది. సయాటికా నొప్పికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి హెర్నియేటెడ్ డిస్క్. గాయం లేదా ఒత్తిడి కారణంగా వెన్నెముకలోని అనేక డిస్క్‌లలో ఒకటి  పగిలిపోయినప్పుడు ఇది వస్తుంది. దీనివల్ల డిస్క్ లోపల ద్రవం బయటకు లీక్ అవుతుంది. దీని వల్ల హెర్నియేటెడ్ డిస్క్ ఏర్పడుతుంది. ఇది వెన్నుపాము, దాని నరాలపై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల నొప్పి,  బలహీనత ఏర్పడుతుంది. సయాటికా నొప్పికి ఒక సాధారణ కారణం వెన్నెముక కింది భాగంలో గాయం కావడం.  ప్రమాదంలో గాయపడి, ఆ గాయం వెన్నెముక కింది భాగంలో ప్రభావం చూపినప్పుడు సయాటికా నొప్పి రావచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ కూడా సయాటికా నొప్పికి కారణం అవుతుంది.  మన కీళ్లలో కార్టిలేజ్ అనే మృదువైన పొర ఉంటుంది. ఇది ఎముకలు ఒకదానికొకటి రుద్దకుండా కాపాడుతుంది. ఈ పొర క్షీణించడం లేదా బలహీనపడటం మొదలైనప్పుడు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి. సాధారణంగా ఆర్థరైటిస్ అని పిలువబడే ఆస్టియో ఆర్థరైటిస్‌ను ఆర్థరైటిస్ అని కూడా అంటారు.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

బాదం పప్పు తినే వారికి అలర్ట్.. ఈ నిజాలు తెలుసుకోకుండా తినకండి..!

డ్రై ప్రూట్స్ కోవలో చాలామంది తమకు తెలియకుండానే నట్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో బాదం,  వాల్నట్ వంటివి ప్రధానంగా ఉంటాయి.  ఇవి  ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవని అనుకుంటారు. చాలా రకాల వ్యాధులు రాకుండా చేయడంలో ఈ  డ్రై నట్స్ చాలా సహాయపడతాయి.   బాదం పప్పులు అటువంటి డ్రై నట్స్ లో ఒకటి. బాదం పప్పులు శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందించే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు,  ఫైబర్ వంటివి కలిగి ఉంటాయి.  ప్రతిరోజూ రాత్రి బాదం పప్పులు నీటిలో నానబెట్టుకుని వాటిని ఉదయాన్నే  తినేవారు అధికంగా ఉంటున్నారు. అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని  రోజూ అధికంగా బాదం పప్పు తినేవారు కొందరు ఉంటారు.  అసలు బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం?  ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే.. బాదం తో ఆరోగ్యం.. బాదం అధికంగా తినడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.   కొంతమందిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను కూడా కలిగిస్తుందని కూడా చెబుతున్నారు. ఇది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై  ప్రతికూల ప్రభావాలను చూపుతుందట. కాబట్టి బాదం పప్పులు ఎన్ని తీసుకోవాలి అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. బాదం పప్పుతో నష్టాలు.. బాదం పప్పును అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, బరువు పెరగడం,  మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు వస్తాయి. రోజువారీ సిఫార్సు చేయబడిన బాదం పప్పు తీసుకోవడం వ్యక్తిగత ఆరోగ్యాన్ని బట్టి మారుతుంది. అయితే వీటిని తక్కువగానే తీసుకోవాలి. బాదం పప్పును అధికంగా తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు కనుగొన్నారు. బాదం పప్పులో కరిగే ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఈ సమ్మేళనం అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల వైఫల్యం,  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అందువల్ల బాదం పప్పును అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బాదం ఎక్కువగా తినేవారికి  బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. సాధారణ ఆహారంతో పాటు పెద్ద మొత్తంలో బాదం (20 కంటే ఎక్కువ) తీసుకుంటే, అదనపు కేలరీలు చేరి వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. బరువు పెరగడం వల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఫైబర్  ఎక్కువ ఉండటం వల్ల ఇతర ఖనిజాలైన కాల్షియం, మెగ్నీషియం, జింక్,  ఐరన్  వంటి ఖనిజాల  శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  బాదంను పెద్ద మొత్తంలో తీసుకుంటే అది శరీరంలోని ఇతర పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. దీని కారణంగా అలసట, బలహీనత,  అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. -రూపశ్రీ

కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసా?

ల్యాప్ టాప్  వాడకం ప్రస్తుతం జనరేషన్ లో చేసే ఉద్యోగాలలో సర్వసాధారణం అయిపోయింది.   కార్పొరేట్ ఉద్యోగాల నుండి సాధారణ ఆఫీసుల వరకు ప్రతి ఒక చోట కంప్యూటర్ వాడకం తప్పనిసరిగా మారిపోయింది.  అలాగే ఇటీవలి కాలంలో వర్క్ ఫ్రం హోం కూడా ఎక్కువ అయ్యింది. దీంతో  సౌలభ్యం కోసం లాప్ టాప్ వినియోగించడానికి అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. అయితే  లాప్ టాప్  ఎక్కువగా వినియోగించేవారిలో  కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనే సమస్య వస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ లో ఉండే లక్షణాలు ఏంటి? ఇది ఎంత వరకు ప్రమాదం? దీన్ని ఎలా నివారించాలి?  అంటే..   కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది  ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు,  స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి  చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం,  వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం,  రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం,  పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.   ఎప్పుడూ  కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌తో పని చేయడం వల్ల    మెడ కండరాలు,  మణికట్టు నరాలపై ఒత్తిడి పడుతుంది. రోజంతా టైప్ చేయడం వల్ల కలిగే ఒత్తిడి కార్పల్ టన్నెల్‌లోని కణజాల వాపు,  మధ్యస్థ నాడి కుదింపునకు కారణమవుతుంది. ఆఫీసులో పనిచేయడం మాత్రమే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌కు కారణం కాదు,  వయస్సు,  జన్యుశాస్త్రం కూడా పాత్ర పోషిస్తాయి.  కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  ఎర్గోనామిక్‌గా రూపొందించబడిన కంప్యూటర్ మౌస్ కార్పల్ టన్నెల్‌లోని నరాలపై ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పని చేస్తున్నప్పుడు మౌస్  మణికట్టుపై ఒత్తిడి పెట్టకుండా చూసుకోవాలి. అలాగే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ మీద వంగి పని చేయడం వల్ల మెడ,  వీపుపై  ఒత్తిడి పడుతుంది.  ఇది మీ చేతులు,  మణికట్టును ప్రభావితం చేస్తుంది. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌ను నివారించడానికి, లాప్ టాప్ పై పని చేసేటప్పుడు కూర్చునే   భంగిమపై  శ్రద్ధ వహించాలి. ఇక మణికట్టు ఆరోగ్యంగా ఉండాలంటే  సరైన టైపింగ్ పొజిషన్  చాలా ముఖ్యం.  మణికట్టును ఎక్కువగా పైకి లేదా క్రిందికి వంచకుండా ఉండాలి.  కీబోర్డ్‌ను  మోచేతుల వద్ద లేదా కొద్దిగా క్రింద ఉంచడానికి ప్రయత్నించాలి. అదే విధంగా  కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌ను  ప్రతి గంటకు ఒకసారి  డెస్క్ నుండి లేవడం చాలా ముఖ్యం. బ్రేక్  సమయంలో  మణికట్టు,  చేతులను సాగదీయాలి. ఇది నరాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆఫీసులో పనిచేయడం అంటే కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌ల గురించి మాత్రమే కాదు, చేతివ్రాత గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.  మంచి పట్టు ఉన్న పెద్ద పెన్నులను ఎంచుకోవాలి. మణికట్టు మీద ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి.  -రూపశ్రీ

ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే మ్యాజిక్కే!

భారతీయుల వంటింట్లో బోలెడు దినుసులు ఉంటాయి.  వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు మెరుగ్గా ఉంటాయి.  అటు మౌత్ ఫ్రెషనర్ గా, ఇటు వంటల్లో రుచిని పెంచడానికి ఉపయోగించే దినుసుల్లో సోంపు అగ్ర స్థానంలో ఉంటుంది.  సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు  వైద్యులు,  ఆహార నిపుణులు.  అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? సోంపు నీరు ఎలా తయారు చేసుకుని తాగాలి? ఇవన్నీ తెలుసుకుంటే సోంపుతో కలిగే బెనిఫిట్స్  ను అందరూ పొందవచ్చు. సోంపు నీటి ప్రాధాన్యత..  సోంపు నీటిని శక్తివంతమైన,  ఆరోగ్యకరమైన పానీయంగా ఉపయోగిస్తున్నారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  తరచుగా సోంపును మౌత్ ఫ్రెషనర్‌గా మాత్రమే ఉపయోగిస్తుంటారు.  కానీ సోంపు దీని కంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక వ్యాధులను నయం చేయడంలో శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది. సోంపు నీరు ఎలా తయారు చేయాలి? సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది కడుపు సంబంధిత వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది,  జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. సోంపు నీరు ప్రయోజనాలు..  ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీటిని తాగితే, శరీరంలో అనేక సానుకూల మార్పులు కలుగుతాయి. సోంపు నీరు బరువు తగ్గడానికి  సహాయపడుతుంది.  ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. సోంపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు సంబంద వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది యాసిడ్ కారణంగా  ఏర్పడే ఎసిడిటీ,  యాసిడ్ రిప్లక్స్ వంటి ఉదర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కడుపు చికాకును తగ్గిస్తుంది,  కడుపును మంటను తగ్గించి కడుపును శాంతపరుస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కుంటున్న అతి ఆకలి సమస్యకు సోంపు చెక్ పెడుతుందట.   కడుపు నిండినప్పటికీ పదే పదే  ఆహారం  తినాలని అనిపించడం, ఆకలి వేయడం వంటి లక్షణాలు ఆరోగ్యానికి హానికరం. సోంపు నీరు తాగడం వల్ల అనవసరంగా అతిగా ఆకలి వేయడం అనే సమస్య తగ్గుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే సొంపు నీరు తాగడం వల్ల  శరీరం డిటాక్స్ అవుతుంది.  ఇది  కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులు,  సమస్యలను తగ్గిస్తుంది. సోంపు నీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే సోంపులో ఉండే పొటాషియం,  మెగ్నీషియం వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. సొంపు నీరు మహిళలకు ఋతుస్రావ సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.  పాలిచ్చే స్త్రీలలో పాలు పెరగడానికి కూడా సహాయపడుతుంది. -రూప