ఆనందాన్నిచ్చే శ్రమ!
posted on Oct 19, 2022 @ 3:46PM
పిల్లలతో వాళ్ల ఆటలు ఆడుతూండు, వాళ్ల పక్కనే కూచుని చదువుతూంటే గమనిస్తూండు నీ బాల్యం గుర్తొస్తుంది.. అదో ఆనందం, గొప్ప శక్తినిస్తుందంటాడు పిల్లల రచయిత లివింగ్‌స్టన్. అదేమోగాని, పిల్లల చదువు అనగానే తల్లిదండ్రులకు కూడా పెద్ద పరీక్షలతో సమానం. పెద్ద చదువులకు వెళ్లే కొద్దీ వాళ్లతో పాటు చదివినంత పని అవుతుంది. దగ్గరుండి హోమ్‌వర్క్ చేయించడంతో ఆరంభమై వాళ్లకి పోటీ పరీక్షలకు పుస్తకాలు తేవడం, వీలయితే ఒకటి రెండు సబ్జెక్టులు కాస్తంత తెలుసుకోవడం తల్లిదం డ్రుల వంతే అవు తోంది. ఇపుడు రాకేష్ పరిస్థితి ఇదే.
అభిజిత్ అనే ఉద్యోగి ఆమధ్య ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్‌కి బయలుదేరాడు. ఆ క్యాబ్ డ్రైవర్ రా కేష్ తన ఫోన్ లో అప్పటివరకూ చూస్తున్న యూట్యూబ్ బంద్ చేశాడు. ఆ ఉద్యోగి ఏం చూస్తున్నావ్, చదువుతున్నావని అడిగాడు. ఈ చానల్లో కరెంట్ అఫైర్స్, ఆర్ధికశాస్త్రం సంబంధించిన అంశాలు చదు వుతున్నానన్నాడు. అభిషేక్‌కి మతి పోయింది. క్యాబ్ డ్రైవర్‌కి వాటితో అవసరం ఏమొచ్చిందా అని తెగ ఆలోచిస్తూ ఆఫీసుకు వెళ్లాడు. తర్వాత కనుక్కుంటే తన కూతురు కోసం రాకేష్ చదువుతు న్నాడని తెలు సుకుని చాలా ఆనందించాడు. ఏ పనిచేస్తున్నా, తండ్రి తండ్రే.. పిల్లల భవితకు తప్పని శ్రమ..ఎంతో ఆనందాన్నిచ్చే శ్రమ!
తన కూదురు యుపిఎస్‌సి పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. అందుకే రాకేష్ ఆమెకు కావలసిన పుస్తకాలు కొనడమే కాకుండా కొంత నోట్సు రాసుకోవడానికి అతను అధ్యయనం మొదలెట్టాడు. అతనికీ ఎంతో తెలుసుకోవాలన్న తపనా పెరిగింది. పిల్లల్ని తమకంటే ఎక్కువ చదివించాలని, మంచి స్థాయిలో చూడాలనే కదా తల్లిదండ్రులు ఆశించేది.