వచ్చేది మోడీ ప్రభుత్వం: పరుగు తీసిన స్టాక్ మార్కెట్
posted on May 9, 2014 @ 7:25PM
ఇక కేంద్రంలో రాబోయేది నరేంద్రమోడీ ప్రధానిగా ఎన్డీయే ప్రభుత్వం అని దేశ వ్యాపార్, కార్పొరేట్ వర్గాలకు తెలిసిపోయినట్టుంది. అందుకే శుక్రవారం నాడు దేశ స్టాక్ మార్కెట్లు ఎగసిపడ్డాయి. ఈనెల 12వ తేదీన పోలింగ్ ముగిసిన వెంటనే దేశంలో ఎవరు అధికారంలోకి రాబోయేదీ స్పష్టంగా తెలిసిపోతుంది. శుక్రవారం నాడు ఈ వారంలో స్టాక్ మార్కెట్‌కి చివరి రోజు. మోడీ ప్రభుత్వం వచ్చే విషయం సోమవారం నాటికి స్పష్టంగా తెలిసిపోతుంది. అప్పుడు స్టాక్ మార్కెట్ ‘బుల్’కి పట్టపగ్గాలు వుండవు. ఇక రాబోయేది మోడీ ప్రభుత్వమేనని కార్పొరేట్ వర్గాలకు తెలియడం వల్లనేమో శుక్రవారం నాడు భారతీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్ళాయి. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్ఇ 650 పాయింట్లు పైకి దూసుకెళ్ళి 22,994 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 199 పాయింట్లు పైకి ఎగసి 6859 పాయింట్ల వద్ద స్థిరపడింది. మోడీ ప్రభుత్వం వస్తే దేశం అభ్యున్నతి పథంలో పయనిస్తుందన్న నమ్మకం కార్పొరేట్ వర్గాల్లో వుందని, అందుకే మోడీ ప్రభుత్వం అంటే సానుకూల స్పందన కనిపిస్తోందని వ్యాపార, కార్పొరేట్ వర్గాలు అంటున్నాయి.