నరేంద్రమోడీ భారత ప్రధాని అవుతారన్న అమెరికా అధికారి
posted on May 10, 2014 @ 11:33AM
ఇండియాకి కాబోయే ప్రధానమంత్రి ఎవరని దేశంలో చిన్న పిల్లాడిని అడిగినా నరేంద్రమోడీ అని ఠక్కున చెప్పేస్తాడు. భావి భారత ప్రధానిగా నరేంద్రమోడీని తప్ప మరొకర్ని చూడాలని భారత ప్రజలు అనుకోవడం లేదు. నరేంద్రమోడీ ప్రధాని అవుతాడనే విషయం ఇండియన్లతోపాటు అమెరికా వాళ్ళకి కూడా తెలిసిపోయినట్టుంది. ఎందుకు తెలియదు.. ఇండియాలో నిక్కరేసుకునే చిన్న పిల్లాడికైనా తెలిసిపోయిన ఈ విషయం అత్యంత పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ వున్న అమెరికాకి తెలియకుండా వుంటుందా? అందుకే అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మేరీ హర్ఫ్ ఇండియాకి నరేంద్రమోడీ ఇండియాకి కాబోయే ప్రధాని అనే విషయాన్ని తన మాటల్లో బయటపెట్టారు. మేరీ హార్ఫ్ అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ చీఫ్ కూడా కావడం విశేషం. న్యూయార్క్ లో జరిగిన ఒక సమావేశంలో ఒక జర్నలిస్టు మేరీని ‘‘ఇండియాకి మోడీ ప్రధాని అయితే ఆయనను అమెరికాకి ఆహ్వానిస్తారా? ఆయన వీసా సమస్యను ఎలా పరిష్కరిస్తారు?’’ అని ప్రశ్నించారు. దానికి మేరీ స్పందిస్తూ, ‘‘భారత దేశానికి ప్రధాని ఎవరు అయినా మేము ఆయనతో కలసి పనిచేస్తాం. బహుశా త్వరలో మేము నరేంద్రమోడీతో అమెరికాలో సమావేశం కావచ్చు’’ అని సమాధానం చెప్పారు. అంటే అర్థం.. నరేంద్రమోడీ ఇండియాకి ప్రధాని కాబోతున్నారని అమెరికా అధికారులకు అర్థమైపోయిందన్నమాట. నరేంద్రమోడీ ప్రధాని అవుతారన్న విషయం ఇక్కడ వున్న ఇండియన్స్ కి తెలిసిపోయింది. ఎక్కడోవున్న అమెరికా అధికారులకు తెలిసింది. కానీ తల్లీకొడుకులు సోనియా, రాహుల్‌కి, యుపీఏ భాగస్వామ్య పక్షాల నాయకులకి, కేసీఆర్‌కి మాత్రం తెలియడం లేదు.