ముఖ్యమంత్రి తీర్మానంపై సభలో ప్రతిష్టంభన
posted on Jan 27, 2014 @ 9:45AM
శాసనసభ, శాసనమండలిలో తెలంగాణా సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు అరగంటసేపు వాయిదా పడ్డాయి. ముఖ్యమంత్రి టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఇచ్చిన తీర్మానాన్ని సభలో ప్రేవేశపెట్టవద్దంటూ తెరాస నేతలు ఇచ్చిన తీర్మానాన్ని సభాపతి నాదెండ్ల మనోహర్ తిరస్కరించడంతో తెరాస నేతలు సభలో ఆందోళనకు దిగారు. టీ-కాంగ్రెస్, టీ-తెదేపా, తెరాస సభ్యులందరూ ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్న తీర్మాన్న్ని ముక్తకంఠంతో వ్యతిరేఖిస్తున్నందున బహుశః మిగిలిన నాలుగు రోజులు కూడా ఉభయ సభలలో బిల్లుపై ఇక ఎటువంటి చర్చజరుగకపోవచ్చును. ఈ సమస్యను పరిష్కరించేందుకు సభాపతి బిజినస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ కూడా అదే పరిస్థితి తలెత్తవచ్చును. గనుక, ఇక బిల్లుపై ఎటువంటి చర్చ, తీర్మానం, ఓటింగ్ జరగకుండానే రాష్ట్రపతికి త్రిప్పి పంపబడే అవకాశాలే ఎక్కువ. బహుశః కేంద్రం కూడా అలాగే జరగాలని కోరుకొంటోందేమో.