మరో వారసుడొచ్చాడు...
posted on Mar 13, 2021 @ 2:25PM
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి,దివంగత కరుణానిధి, మనవడు ప్రస్తుత డిఎంకే అధ్యక్షడు, ప్రతిపక్ష నేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, తాత చెప్పుల్లో కాలుపెట్టారు. ఇప్పటికే సినిమా రంగంలో హీరోగా, నిర్మాతగా, రాజకీయంగా పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఉదయనిధి, తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు.ఇదేమీ అనూహ్యం కాదు, అలాని అనుకున్నదీ కాదు. కుటుంబ పార్టీలలో వారసులు వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం న్యాచురల్ అందులో విశేషం లేదు.
డిఎంకే పార్టీ టికెట్ ఆశించేవారికి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తుంది.అలాగే,ఉదయనిధి కూడా ఇంటర్వ్యూకు హాజరయ్యారు.ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయ్యారని, ఇక ఆయనకు టికెట్ రాదని వార్తలొచ్చాయి. కానీ, తాజా కబర్’ ప్రకారం,ఆయనకు పార్టీ టికెట్ వచ్చింది. వడ్డించే వాడు మన వాడు అయితే ఏ పంక్తిలో, ఏ మూలన కూర్చున్నా, లడ్డులూ, జిలేబీలు అడగకుండానే నడుచుకుంటూ వచ్చేస్తాయి. పరీక్ష తప్పిన వారికీ కొలువులొచ్చేస్తాయి. అలాగే , ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయినా , దయానిధికి టికెట్ వచ్చింది.అది కూడా గతంలో పెద్దాయన, డిఎంకే అగ్రనేత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చంపాక్’ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అద్రుష్మ ఉదయనిథినిని వరించింది.
ఏప్రిల్ 6 న పోలింగ్ జరిగే రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా మరికిన్ని చిన్నా చితకా పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న డిఎంకే , పార్టీ పోటీ చేస్తున్న 173 నియోజక వర్గాల అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. అందులో ఉదయనిథి పేరుంది.దురై మురుగన్ వంటి కురు వృద్ధులు సహా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు 76 మందికి డిఎంకే టిక్కెట్లు ఇచ్చింది. కరుణానిధి చనిపోయిన తర్వాత , చంపక్ ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే అంబజగన్, కరోనాతో కన్ను మూయడంతో, సునాయాసంగా గెలిచే చంపక్ సీటు ఉదయనిధికి దక్కింది.
తమిళనాడులో ఈసారి గెలిచేది డిఎంకేనే అని సర్వేలన్నీకోడై కూస్తున్నాయి. అదే జరిగి పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న డిఎంకే అధికార పగ్గాలు చేపడితే, కరుణానిధి మంత్రివర్గంలో స్టాలిన్, చంద్రబాబు కాబినెట్’లో లోకేష్ , కేసీఆర్ కాబినెట్’లో కేటీఆర్, ఉద్దవ్ మంత్రివర్గంలో ఆదిత్య థాక్రే ... లాగా స్టాలిన్ కాబినెట్’ ఉదయనిధి మంత్రి అవుతారు. ఆ తర్వాత అఖిలేష్ , ఒమర్ అబ్దుల్లా అదృష్టం కలిసొస్తే ముఖ్యమంత్రి అవుతారు. కాదంటే కనీసం మాజీ మంత్రిగా అయిన మిగులుతారు. భవిష్యత్ ఊహాలను పక్కన పెట్టినా ప్రస్తుతానికి డిఎంకేకి వారసుడొచ్చాడు. అలా ఓపనైపోయింది