రాష్ట్రంలో ఇంటింటా వరలక్ష్మి వ్రతాలు
posted on Jul 27, 2012 @ 11:06AM
రాష్ట్రంలో ఇంటింటా శ్రావణ శుక్రవారం సందడీ మొదలైంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రావణ శుక్రవారం రోజు కొండెక్కిన పూలు, పండ్ల ధరలతో సామాన్య ప్రజలు కొనలేక అవస్థలు పడుతున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాల్లో మహిళలు వరలక్ష్మీ పూజలు నిర్వహించారు. మహిళలు సౌభాగ్యవతిగా ఉండాలని, ఆరోగ్య, ఐశ్వర్యాలను సిద్ధించాలని ఈ వ్రతం చేస్తుంటారు. వరాలిచ్చే వరలక్ష్మీ దేవి తమ ఇంటికి రావాలని మహిళలు ఉపవాసాలు ఉంటారు. ఇటు ఆలయాల్లోనూ రద్దీ బాగా పెరిగింది. విజయవాడ, శ్రీశైలం తదితర ఆలయాలతో పాటు మిగతా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Sri Varalakshmi Vratam - Varalaxmi Puja