కౌశిక్ రెడ్డి కంటే శ్రీరెడ్డి బెటర్.. కాంగ్రెస్ నేతల కౌంటర్
posted on Jul 13, 2021 @ 11:03AM
తెలంగాణ రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తనకు హుజారాబాద్ టీఆర్ఎస్ టికెట్ వచ్చిందంటూ కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న కౌశిక్ రెడ్డి చెబుతున్న మాటల లీకై వైరల్ గా మారాయి. రాజకీయ కలకలం రేపాయి. కౌశిక్ రెడ్డి తీరుపై సీరియస్ గా స్పందించిన పీసీసీ క్రమశిక్షణ సంఘం.. ఆయన 24 గంటల డెడ్ లైన్ తో నోటీసు ఇచ్చింది. అయితే నోటీసును పట్టించుకోని కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. రాజీనామ ప్రకటన చేస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. 50 కోట్లకు పీసీసీ పదవి అమ్ముకున్నారని చెప్పారు. హుజురాబాద్ విషయంలో ఈటల రాజేందర్ కు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారని కుడా కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు రేవంత్ రెడ్డిని ముమైత్ ఖాన్ తో పోల్చుతూ కామెంట్ చేశారు కౌశిక్ రెడ్డి.
కౌశిక్ రెడ్డి ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా కౌంటరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఓ రేంజ్ లో కౌశిక్ రెడ్డిపై ఫైరయ్యారు. ఇందిరా భవన్ లో మీడియాతో మాట్లాడిన కవ్వంపల్లి సత్యనారాయణ.. పాడి కౌశిక్ రెడ్డి ఓ చీటర్ అన్నారు. ఎందరి దగ్గరో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడని ఆరోపించారు. పైలట్ రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇపిస్తానని డబ్బులు తీసుకోలేదా ? అని ప్రశ్నించారు. ఆడియో టేపుతో అడ్డంగా దొరికిన దొంగ కౌశిక్ అన్నారు. కౌశిక్ రెడ్డి ఓ దొంగ, ఓ లోఫర్.. రేవంత్ కాలి గోటికి సరిపోడంటూ కవ్వంపల్లి విరుచుకుపడ్డారు.
రేవంత్ డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నాడని ఆరోపిస్తున్న కౌశిక్ రెడ్డి.. ఎన్ని కోట్లిచ్చి 2018లో హుజురాబాద్ టికెట్ తెచ్చుకున్నాడో చెప్పాలని కవ్వంపల్లి సత్యనారాయణ ప్రశ్నించారు. డబ్బులు ఇస్తేనే పీసీసీ వస్తదనుకుంటే.. ఆ పదవి కోమటి రెడ్డికే వచ్చేదని చెప్పారు. కౌశిక్ రెడ్డి షికండి.. ఆయన కంటే శ్రీ రెడ్డి బాగుంటుందని కవ్వంపల్లి కామెంట్ చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి పదివేల ఓట్లు తెచ్చుకోవాలంటూ కౌశిక్ రెడ్డికి సవాల్ చేశారు కవ్వంపల్లి సత్యనారాయణ.