స్పీడ్ న్యూస్ 2
posted on Jul 18, 2023 @ 3:09PM
16. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మూడేళ్ల చిన్నారి ఇంట్లో గన్ తో ఆటలాడుతూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కింది. దీంతో అక్కడే ఆడుకుంటున్న ఏడాది వయస్సున్న చెల్లి తలలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లి ఆ పాప మరణించింది.
..............................................................................................................................................................
17. టమాటాల ధర కొనాలంటేనే భయపెట్టేలా ఉంది. దీంతో టమాటాల దొంగతనాలు పెరిగిపోయాయి. యూపీలోని నవీన్ సబ్జీ మండిలోని ఓ జాబర్ దుకాణంలో దొంగలు పడి పాతిక కిలోల టమాటాలను దొంగతనం చేశారు. ఈ టమాటాల దొంగతనం కలకలం సృష్టించింది.
....................................................................................................................................................
18.వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. అలాగే అవినాష్ బెయిలు రద్దు పిటిషన్ పై కౌంటర్ దాఖలుతో పాటు వివేకా హత్య కేసు వివరాలు సీల్డ్ కవర్ లో అందించాలని సీబీఐని ఆదేశించింది.
.........................................................................................................................................................
19. యువత కోసం కుటుంబ పార్టీలు ఎన్నడూ ఆలోచించలేదని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే కుటుంబ పార్టీల అజెండా అని ధ్వజమెత్తారు.ఎజెండా అని ధ్వజమెత్తారు. కుటుంబపాలన కాపాడుకోవడమే ఆ పార్టీల పని అని.. అవినీతిని వారు పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు.
............................................................................................................................................................
20. ఈ రోజు తెల్లవారు జామున మరణించిన కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ భౌతిక కాయం వద్ద కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. అనంతరం ఆయన చాందీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చాందీ మృతి తీరని లోటని పేర్కొన్నారు.
...........................................................................................................................................................
21. కేరళ మాజీ సీఎం ఉమెన్ చాంది మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ అభివృద్ధికి ఆయన చేసిన కృషి నిరుపమానమని మోడీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గతంలో ఆయనతో దిగిన ఫోటోలను ప్రధాని ఆ ట్విట్ లో షేర్ చేశారు.
.............................................................................................................................................................
22. కడప రైతు బజారులో రాయతీ ధరకు టమాటాలను అందజేస్తుండటంతో జనం క్యూ కట్టారు. కిలో టమాటాలను రూ.48లకే ఇస్తుండటంతో జనం దాదాపు రెండు కిలో మీటర్ల మేర క్యూలో నిలుచుకున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో టమాటాల ధర రూ.150లకు పైనే ఉంది.
..............................................................................................................................................................
23. పరువునష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులోస్టే పడిన శిక్షపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.
...............................................................................................................................................................
24. తొమ్మిదేళ్ల బాలుడిపై నిన్న రాత్రి వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వీధికుక్కల బెడద తీవ్రంగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
.............................................................................................................................................................
25. హిండెన్‌బర్గ్ నివేదిక పూర్తిగా దురుద్దేశపూరితమని తేలిపోయిందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన తమ గ్రూప్ కంపెనీలలో ఎలాంటి ఉల్లంఘనలూ లేవని నిపుణుల కమిటీ తేల్చిందని చెప్పారు.
........................................................................................................................................................
26.అమరావతినే ఏపీకి ఏకైక రాజధానినగా కొనసాగించాలన్న డిమాండ్ తో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు రాజధాని టు రాజధాని పాదాయాత్ర చేపట్టారు. హైదరాబాద్ వనస్థలి పురంలోని పనామా సర్కిల్ నుంచి అమరావతికి ఆయన నిన్న పాదయాత్ర ప్రారంభించారు.
..........................................................................................................................................................
27. వనపర్తి జిల్లా అమ్మపల్లి గ్రామంలోకి పొలం వద్ద ఉన్న పాడుబడిన బావి వద్ద అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో ఓ భారీ మొసలి చిక్కుకుంది. భారీ మొసలిని చూసి గ్రమస్థులు ఆందోళనకు గురయ్యారు. అటవీ అధికారులు ఆ మొసలిని బీచుపల్లి సమీపంలో కృష్ణానదిలో వదిలారు.
...............................................................................................................................................................
28.బీజేపీకి జేడీఎస్ బీ-టీమ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కౌంటర్ ఇచ్చారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏ టీమ్‌కు చెందిన వారో చెప్పాలని నిలదీశారు.
.........................................................................................................................................................
29. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు బెయిలు ఇచ్చింది. అయితే రాఘవకు బెయిల్ ఈడీ వ్యతిరేకించలేదు.
.......................................................................................................................................................
30. పవన్ కల్యాణ్ సేవాభావం, పార్టీ విధివిధానాలు నచ్చడం వల్లే ఆ పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ కి ఇటీవలే రాజీనామా చేసిన విశాఖకు పంచకర్ల రమేశ్ బాబు అన్నారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను తన సొంత డబ్బుతో ఆదుకున్న ఒకే ఒక్క నేత పవన్ కల్యాణ్ అని అన్నారు.