Read more!

ఆంధ్రా మీద సోనియా ఆశ చావనట్టుంది..

 

 

 

రాష్ట్రాన్ని విభజించొద్దు మొర్రో అని సీమాంధ్రులు ఎంతగా మొత్తుకున్నా వినకుండా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన సోనియాగాంధీ ఎన్నికలలో సరైన ఫలితం అనుభవించారు. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ స్థానంలో కూడా సీమాంధ్రలో గెలవలేదు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం గెలిచే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తుంటే, సీమాంధ్ర ప్రజలు తాము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు.

 

అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులురాలు సోనియాగాంధీకి కాంగ్రెస్ పార్టీ మీద ఆశ చావనట్టు కనిపిస్తోంది. అందుకే సీమాంధ్ర ప్రజలను దువ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలని ఆమె కోరారు. ఎపి రాజధాని నిర్మాణం కోసం సహకరించాలని, ఆర్థిక లోటు రాకుండా చూడాలని ఆ లేఖలో కోరారు. ఇదిగో సోనియమ్మా.. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మటాషైపోయింది. ఇప్పుడు తమరెంత ట్రై చేసినా ఉపయోగం లేదు.