ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడుగా ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు
posted on Jul 28, 2020 @ 9:47AM
ఏపీ బీజేపీ అధ్యక్షుడు గా ఉన్న కన్నా లక్ష్మి నారాయణ ను తప్పించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజును పార్టీ అధిష్టానం కొత్త అధ్యక్షుడు గా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణం ఇది అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో అయన పేర్కొన్నారు. ఏపీ బీజేపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న సోము వీర్రాజు తూర్పు గోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన వారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి గా యువకులైన విష్ణు వర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్ పేర్లను కూడా పరిశీలించిన అధిష్టానం చివరికి సోము వీర్రాజు వైపు మొగ్గినట్లుగా సమాచారం.
ఇది ఇలా ఉండగా 2014 అక్టోబర్ లో అమిత్ షా సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. ఐతే 2018 మే నెలలో ఆయనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా నియమించారు. ఐతే కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ సవరణ బిల్లుల విషయంలో గవర్నర్ కు లేఖ రాయడంపై బీజేపీ కేంద్ర నాయకత్వం అసంతృప్తిని వ్యక్తం చేసిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో సోము వీర్రాజును బీజేపీ ఏపీ చీఫ్ గా నియమనిచడం ప్రాధాన్యత సంతరించుకొంది.