రాజా రెడ్డి, వైఎస్ తరహాలోనే ప్లాన్ చేస్తాం
posted on Oct 26, 2018 @ 1:08PM
విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన దాడి ఘటనపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.సీఐఎస్‌ఎఫ్ అదుపులో ఉండే విమానాశ్రయంలోకి ఓ వ్యక్తి కత్తితో లోనికి ప్రవేశిస్తే పట్టుకోలేకపోయారా? అని ప్రశ్నించారు.జగన్ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే చిన్న ముల్లు కూడా గుచ్చుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలో ఉండే విమానాశ్రయంలో దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు.దాడి విషయంలో వైసీపీ కేంద్రాన్ని ఒక్క మాట అనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖలో కుట్లు వేసే డాక్టర్లే లేరా...దానికి హైదరాబాద్ వరకు వెళ్లాలా? అని ప్రశ్నించారు.చంద్రబాబు పిల్ల కుంకతో హత్య ప్లాన్ చేస్తాడా అని అన్నారు. తాము నిజంగా ప్లాన్ చేస్తే ఇలా గిచ్చుకోవటాలు గుచ్చుకోవటాలు ఉండవని...ప్లాన్ చేయాలనుకుంటే రాజారెడ్డి, వైఎస్ తరహాలోనే చేస్తామని వ్యాఖ్యానించారు.
జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి గవర్నర్‌తో విచారణ జరిపించాలని జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కోరడాన్ని ఆయన తప్పుబట్టారు.జగన్‌కు జరిగిన అరసెంటీమీటర్ గాయానికి గవర్నర్ విచారణ చెయ్యాలా? అని మంత్రి ప్రశ్నించారు.యూపీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్ ను 12 ఏళ్లుగా ఎన్డీఏ కొనసాగిస్తోంది.ఒక గవర్నర్ 12 ఏళ్లుగా ఒకే చోట ఉన్న సందర్భం ఉందా? అని మండిపడ్డారు.గవర్నర్ నరసింహన్ పై కేంద్రానికి ఎందుకు ఇంత ప్రేమ.. అలాంటి గవర్నర్ తో విచారణ చేయించాలని జగన్ బాబాయ్ కోరుతున్నాడని విమర్శించారు.