'ప్రకాష్ రైల్' ఆచూకీ కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
posted on Apr 16, 2020 @ 11:50AM
శ్రీకాకుళం జిల్లా కు చెందిన " ప్రకాష్ రైల్" ఆర్మీ జవాన్ గత కొంత కాలంగా హిమాచల్ ప్రదేశ్ లో విధులు నిర్వహిస్తూ అదృశ్యమైయ్యాడు. అతని సెల్ ఫోన్ కూడా అందుబాటులో లేదు. ఈ విషయాన్ని ఏపి ఆర్.ఎస్.ఎస్. సంచాలకులు మధుకర్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రయ దృష్టికి తీసుకెళ్ళారు.
వెంటనే స్పందించిన గవర్నర్ రక్షణ శాఖ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను "ప్రకాష్ రైల్" గురించి దర్యాప్తు చేసి వెంటనే నివేదిక ఇవ్వవలసిందిగా ఆదేశించారు.
ఉన్నతాధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. " ప్రకాష్ రైల్" మరో జవాన్ తో బాటు చైనా సరిహద్దు లో ఉన్న ఛోలింగ్ ప్రాంతం దగ్గర పహారా కాస్తూ విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవ శాత్తు "సట్లెజ్ " లోయలోకి జారిపడి అదృశ్యమైనట్లు "పూహ పోలీస్ స్టేషన్" లో ఎఫ్ ఐ ఆర్ నమోదైనట్లు గుర్తించారు. ఈవిషయాన్ని అధికారదులు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.
" ప్రకాష్ రైల్" తో బాటు విధి నిర్వహణలో ఉన్న మరో జవాను నది ఒడ్డున పడటం వలన అతన్ని భధ్రతా సిబ్బంది కాపాడింది. హిమాచల్ ప్రదేశ్ గౌరవ గవర్నర్ గారి ఆదేశాల అనంతరం రక్షణ శాఖ మరియు పోలీస్ ఉన్నతాధికారులు 300 మంది సిబ్బంది తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హెలికాప్టర్, గజ ఈతగాళ్లను, థర్మల్ సెన్సార్ లను ఉపయోగించి గాలింపు చర్యలను ముమ్మరం చేయడం జరిగింది. బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం " ప్రకాష్ రైల్" యొక్క క్యాప్ మరియు బ్యాక్ ప్యాక్ లభించాయి. " ప్రకాష్ రైల్" ఆచూకీ కోసం ప్రత్యేక బృందాల గాలింపు కొనసాగుతున్నట్లు ఉన్నతాధికారులు "కల్నల్ సి ఎస్ మఖాన్" మరియు "మేజర్ ఆనంద్" తెలియజేసారు. ఈ దర్యాప్తు పై ఎప్పటికప్పుడు రాజ్ భవన్ కు నివేదిక ఇస్తున్నారు.