బైపోలార్ డిజార్డర్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య...
posted on Oct 15, 2019 @ 3:30PM
బైపోలార్ డిజార్డర్ అంటే మానసిక రుగ్మత. ఇది లక్షలు సంపాదించే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మతిస్థిమితం తప్పేలా చేసింది ఫలితం ఆత్మహత్య. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. గచ్చిబౌలి లోని అపార్ట్ మెంట్స్ నుంచి దూకి చనిపోయాడు రఘురామ్. విజయవాడ సత్యనారాయణ పురానికి చెందిన రఘురామ్ కొంత కాలం క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఇన్ఫోసిస్ లో టీమ్ లీడర్ గా మంచి స్థాయిలో ఉన్నాడు, అదే కంపెనీలో పని చేస్తున్న మరో టెక్కి శ్రీదేవితో ఎనిమిదేళ్ల క్రితం అతనికి పెళ్లయింది, ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది.
కొంత కాలంగా రఘురాం మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. బైపోలార్ డిజార్డర్ తో అతను బాధపడుతున్నాడనీ, అదే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని చెబుతున్నారు. భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సుమారు పది గంటలు సమయంలో మంత్రి సెలెస్టా బిల్డింగ్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు భార్య ఇచ్చిన సమాచారం ఏంటంటే.. పెళ్లి జరిగక ముందు నుంచే ఇతను బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నాడని, ఆ డిజార్డర్ కి ఆశా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని తెలియజేసింది.
అనేకసార్లు కూడా తాను ఆత్మహత్య చేసుకుంటానని అంటే ఆమె కూడా అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి చికిత్స కొనసాగుతున్నది అని ఆత్మహత్యకు ముందు రోజు తాను చనిపోతానని చెప్తే భార్య బాగా ఏడవటం జరిగిందని, ఏడుస్తుంటే లేదు ఊరికే అన్నాను అని అన్నాడని, ఆ క్రమం లో నిన్న ఇద్దరు ఉద్యోగానికి వచ్చిన తర్వాత పనిలో ఉండగా 10 గంటల సమయంలో భార్య ఫోన్ చేస్తే తాను బయటకెళ్ళి టీ తాగి వస్తా అని చెప్పాడని కానీ, అలా బయటకు వచ్చి పక్కన ఉన్నటువంటి మంత్రి సెలెస్టా బిల్డింగ్స్ లోని పై అంతస్తుకు వెళ్ళి అక్కడి నుంచి దూకి చనిపోయాడు అని పోలీసులకు రఘురాం భార్య తెలిపింది.