Read more!

వడదెబ్బ కొట్టని పానీయం రసాల

పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్రంథంలో ఉంది.

అరణ్యవాసంలో ఉన్నప్పుడు, పాండవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట! ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. తన ఆశ్రమాన్ని సందర్శించటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి  రాముని గౌరవార్థం ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉంది.

భావ ప్రకాశ  వైద్య గ్రంథంలో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివరంగా ఇచ్చారు ఎండలోకి వెళ్లబోయే ముందు దీన్ని తాగండి చక్కగా “చిలికిన  మజ్జిగ” ఒక గ్లాసునిండా తీసుకోండి. అందులో ఒక “నిమ్మకాయ రసం”, తగినంత “ఉప్పు”, “పంచదార”, చిటికెడంత “తినేసోడాఉప్పు” కలిపి తాగి అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్లండి వడదెబ్బకొట్టకుండా ఉంటుంది. మరీ ఎక్కువ ఎండ తగిలిందనుకొంటే తిరిగి వచ్చిన  తరువాత ఇంకోసారి త్రాగండి. ఎండలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసానిండా దీన్ని తయారు చేసుకొని వెంట తిసుకెళ్లండి. మాటిమాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు.