స్మితా సబర్వాల్ పర్సనల్, ఇంట్రస్టింగ్ మేటర్స్
posted on Jun 6, 2014 @ 6:27PM
మెదక్ జిల్లా కలెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న స్మితా సబర్వాల్. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 2001లో ట్రైనీ కలెక్టర్‌గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఈమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. యువతరానికి స్ఫూర్తిదాయకంగా వుండే స్మితా సబర్వాల్ పర్సనల్ విశేషాలు....
1977 సంవత్సరం జూన్ 19వ తేదీన జన్మించిన స్మిత గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో పూర్తి చేశారు. ఈమె ఎన్ఎస్ఎస్‌లో చురుకైనవాలంటీర్. బిజినెస్ లా అకౌంటెన్సీ మార్కెటింగ్‌లో డిగ్రీ హోల్డర్. ఏ గ్రేడులో ఉత్తీర్ణులైన ప్రతిభాశాలి. 2001 ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన స్మితా... 2001లో మొదట అదిలాబాద్‌లో ట్రైనీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్‌గా, గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా, కడపలో ప్రాజెక్టు డైరక్టర్‌గా, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, విశాఖపట్టణంలో వాణిజ్యపన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. అనంతరం హైదరాబాద్‌లో జాయింట్ కలెక్టర్‌గా, 2010లో కరీంనగర్ కలెక్టర్‌గా, నిన్నటి వరకుమెదక్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా అనేక మంచి పనులు చేసి జిల్లా వాసుల నుంచి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. తెలుగు, బెంగాల్, ఇంగ్లీషుల్లో అనర్గళంగా మాట్లాడే స్మితా సబర్వాల్ అండర్ 16 బ్యాడ్మింటన్ విభాగంలో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించారు. అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో కూడా ఈమె పాల్గొన్నారు.
స్మితా సబర్వాల్ భర్త పేరు అకున్ సబర్వాల్. ఆయన ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.