చెల్లెళ్లు కన్నీరు మున్నీరు!.. జగన్ దుర్మార్గానికి నిలువెత్తు నిదర్శనం!
posted on May 11, 2024 @ 10:19AM
అమ్మా న్యాయం చేయండి.. ఐదేళ్లుగా అక్కాచెల్లెళ్లు న్యాయం కోసం పోరాడుతున్నారు.. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆడ బిడ్డలు పుట్టింటికి వస్తే చీరసారె పెట్టి పంపిస్తారు.. మీ ఆడ బిడ్డలు పుట్టింటికి వచ్చి చీరసారె అడగడం లేదు.. కొంగు చాపి న్యాయం అడుగుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ఓటు హస్తం గుర్తుకు వేసి షర్మిలమ్మ కొంగు నింపాలని కోరుకుంటున్నాను.. మీరంతా అలా చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నాను.. షర్మిలమ్మతోనే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరుతాయి. ఈ మాటలన్నది ఎవరో తెలుసా? అత్యంత దారుణంగా గొడ్డలి వేటుకుగురై రక్తపు మడుగులో గిలగిలాకొట్టుకొని కన్నుమూసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవటంతో కడపలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార వాహనంపై సునీత, షర్మిల చెరోపక్క నిల్చోగా మైకుపట్టుకొని కన్నీరుపెడుతూ సౌభాగ్యమ్మ మాట్లాడం.. ఆమెను చూసి సునీత, షర్మిలలు కళ్ల నుంచి ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ప్రజల వైపు న్యాయంకోసం చూడటం కనిపించింది. ఆ ముగ్గురు మహిళలు న్యాయం కోసం కన్నీరు పెట్టుకున్న పరిస్థితిని చూసి అక్కడికి వచ్చిన ప్రజలు చలించిపోయారు. అంతటి హృదయ విదారకమైన ఘటనకు కారణం ఎవరంటే ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతీఒక్కరికీ తెలుసు. ఆయనే దివంగత వైఎస్ వివేకానందరెడ్డి అన్న కుమారుడు, షర్మిల, సునీతలకు అన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
వైసీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి రాక్షస పాలనకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు, ఉన్నత వర్గాల ప్రజలతోపాటు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యలపై నిలదీస్తే అక్రమకేసులు బనాయించి జైళ్లకు పంపించడం. నిత్యం రక్షాస పాలనను తలపించేలా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. జగన్ దుర్మార్గ పాలనకు రాష్ట్ర ప్రజలేకాక.. సొంత చెల్లెళ్లు సైతం కన్నీరు పెట్టుకుంటున్నారు. జగన్ బాబాయ్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి కీలక ముద్దాయి అని సీబీఐ ఆధారాలతో సైతం రుజువు చేసింది. కానీ అవినాశ్ కు జగన్ అండగా నిలుస్తూ వస్తున్నారు. దీన్ని భరించలేని సునీత, షర్మిల వివేకా హంతకులను అరెస్టు చేయాలంటూ న్యాయంకోసం పోరాడుతున్నారు. తన తండ్రిని హత్యచేసిన హంతకులను శిక్షించాలని కోరుతూ.. ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ వివేకా కుమార్తె సునీత తిరుగుతున్నారు. చెల్లెళ్ల న్యాయపోరాటానికి సీఎం హోదాలో సహకారం అందించాల్సిన జగన్.. వారిపై ఎదురుదాడి చేస్తూ, వైసీపీ సోషల్ మీడియాద్వారా వారిపై లేనిపోని అబాండాలు వేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఏపీలో రాష్ట్ర ప్రజలు జగన్ ఐదేళ్ల పాలనలో ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో షర్మిల, సునీత, సౌభాగ్యమ్మల కన్నీరు నిదర్శనంగా నిలుస్తోంది.
వైఎస్ జగన్ ఇటీవల ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్ పాలిటిక్స్ లోకి రానివ్వనందుకే తన నుంచి షర్మిల, సునీత దూరమయ్యారన్నారు. వారిని పార్టీలోకి చేర్చుకుని ఉంటే అది కుటుంబ రాజకీయం అయ్యేది. ప్రస్తుతం వారసత్వ సమస్య కూడా లేదు. వైఎస్ వారసుడిగా నేను ఉన్నాను. నేనింకా యువకుడినే. మరో 20 ఏళ్ల తర్వాత అలాంటి సమస్య రావచ్చేమో. అది కుటుంబంలోని సంబంధాలను నాశనం చేస్తుంది. ఎవరైనా ఇంటికి వస్తే స్వేచ్చగా మాట్లాడుకునే పరిస్థితి రావాలి. కానీ, అన్నిచోట్లా రాజకీయాలు ఉండకూడదు అంటూ జగన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. జగన్ వ్యాఖ్యలను బట్టిచూస్తే.. వైసీపీలో షర్మిల ఉంటే ఆయనకు కచ్చితంగా పోటీ అవుతారని భావించి.. కావాలనే షర్మిలను వైసీపీ నుంచి జగన్, ఆయన వర్గీయులు పంపించారని స్పష్టంగా అర్ధమవుతున్నది. జగన్ వ్యాఖ్యలకు షర్మిల సమాధానం చెప్పారు. ఈ క్రమంలో తన సొంతఅన్న అలా మాట్లాడటం జీర్ణించుకోలేక భోరున ఏడ్చారు.
నువ్వు జైల్లో ఉంటే.. 19 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే ప్రచారం చేయాలని అడిగింది నువ్వు కాదా జగన్? చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతోంది, పాదయాత్ర చేయి షర్మిలా అని కోరింది నువ్వు కాదా జగనన్నా? నాకు రాజకీయ కాంక్ష ఉంటే.. నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో ఉన్నారు. అప్పుడు మొత్తం పార్టీ నా చుట్టూ ఉంది. నిజంగా నాకు రాజకీయ కాంక్ష ఉంటే నేను అప్పుడే పార్టీని హైజాక్ చేయలేనా? అన్నీ జగనన్నే అనుకున్నా.. నా కుటుంబాన్నిసైతం వదిలిపెట్టి నీ కోసం పనిచేశా.. కానీ, నువ్వు నాకు చేసింది ఏమిటి జగన్ అంటూ షర్మిల కన్నీరు పెట్టుకుంటూ ప్రశ్నించారు.
రాజకీయ లబ్ధికోసం చెల్లెళ్లను రోడ్డుపైకి నెట్టేసిన జగన్ మోహన్ రెడ్డి పట్ల ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు. జగన్ రక్షస పాలనతో ప్రజలతో పాటు ఉద్యోగులుసైతం ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులను మద్యం షాపుల వద్ద ఉంచిన ఘనత దేశంలో ఒక్క జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీంతో ఉద్యోగులంతా ఏకమయ్యారు.. మరోసారి జగన్ అధికారంలోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా జగన్‌కు గట్టి షాకిచ్చారు. మొత్తానికి చెల్లెళ్ల కన్నీటి ఉసురు ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి గట్టిగానే తగలనుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.