ప్రాంక్ వీడియో యాంకర్‌తో ఫైటింగ్ చేసిన యజమాని..
posted on Jul 29, 2021 @ 11:43AM
సోషల్ మీడియా వచ్చాక కొందరి వ్యక్తులకు హద్దు అదుపులేకుండా పోయింది. మనకు తెలియకుడండానే మన సంస్కృతి పై దాడి చేస్తున్నారు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాలు కూడా రోడ్డు పైకి తీసుకువచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ప్రాంక్ వీడియోస్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. వాళ్లకు మరి హద్దులు లేకుండా పోతున్నాయి. కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న విషయాల వాళ్ళ పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. తాజాగా ఒక ఫ్రాంక్ యూట్యూబ్ యాంకర్ ఓ మొబైల్ షాపులో వెళ్లాడు. అక్కడ యజమానితో గొడవకు దిగాడు.దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన షాపు ఓనర్ యాంకర్‌పై దాడికి దిగాడు.
ఇక వివరాల్లోకి వెళితే ప్రాంక్ వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనకు తెలిసిందే. చాలామంది రోడ్లపై, షాపింగ్ మాల్స్, పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు చేస్తుంటారు. ఈ ప్రాంక్‌లతో పబ్లిక్ కాస్త ఇబ్బందులకు గురైనా.. ఆ తర్వత అవి ప్రాంక్ అని తెలిసి కాస్త నవ్వుకుంటారు. ఎంత ఫ్రాంక్ ఐన పబ్లిక్ కొంత ఇబ్బంది పడుతుంటారు. అయితే హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్‌లో ఓ యాంకర్ చేసిన ప్రాంక్ వీడియో కలకలం రేపింది. ఓ మొబైల్ షాప్‌లో గొడవ జరిగింది.
హైదరాబాదీ ప్రాంక్స్’ యూట్యూబ్ ఛానెల్ యాంకర్ ప్రాంక్ వీడియోలో భాగంగా షాప్ యజమానితో గొడవకు దిగాడు. జగదీశ్ మార్కెట్‌లో యాంకర్ ఓమొబైల్ షాపుకు వెళ్లారు. షాప్ యజమానితో గొడవకు దిగాడు యాంకర్. అది కాస్త చిలికిచిలికి గాలివానగా మారినట్టు..ఈ గొడవ కాస్తా పెద్దదిగా అయ్యింది. దీంతో ఆవేశానికి లోనైన షాప్ యజమాని యాంకర్ పై దాడికి పాల్పడ్డాడు. ఇది ఫ్రాంక్ వీడియో అని..అక్కడ కెమెరా ఉందని..కావాలని చేస్తున్నామని యాంకర్ చెప్పినా..యజమాని వినిపించుకోలేదు. ఎందుకంటే ఎవడి ఫ్రాస్ట్రషన్ లో వాడు ఉంటారు.. ఈ ఫ్రాంక్ వీడియోస్ చేస్తే వాళ్ళు అది కూడా గమనించాలి. అది గమనించి ఫ్రాంక్ చేస్తే ప్రాబ్లెమ్ ఉండదు.. ఏది తెలుసుకోకుండా రంగంలోకి దిగితే ఇలాగే రచ్చ రచ్చ అవుతుంది. అయితే ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో ఆవేశానికి లోనైన షాప్ యజమాని యాంకర్‌ని చితకబాదాడు. యాంకర్‌ను మరింత కసిగా కొట్టాడు. ఇక ఆ విషయం అక్కడితో ఆగకపోగా చివరికి విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.