ఎంతపని చేశావు షర్మిలమ్మో... షర్మిలమ్మా!
posted on Jun 7, 2024 @ 12:05PM
ఉన్నదానివి వుండకుండా ఎంత పని చేశావు షర్మిలమ్మో షర్మిలమ్మా!
అవినాష్ రెడ్డి మీద నువ్వు పోటీ చేయకుండా వున్నా బాగుండేది షర్మిలమ్మో.. షర్మిలమ్మా!
నువ్వేమో అవినాష్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్నావు షర్మిలమ్మో.. షర్మిలమ్మా!
చివరికి ఓడిపోవాల్సిన వాడిని నువ్వే గెలిపించావు షర్మిలమ్మో.. షర్మిలమ్మా!
నీవల్ల వైసీపీ ఓట్లు చీలి టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని అనుకుంటే, నీవల్లే టీడీపీ అభ్యర్థి ఓడిపోయాడు షర్మిలమ్మో.. షర్మిలమ్మా!
బాబాయ్ హత్య పాయింట్ పట్టుకుని భారీగా ప్రచారం చేశావు షర్మిలమ్మో.. షర్మిలమ్మా!
నువ్వు గెలిచినా బాగుండేది షర్మిలమ్మో.. షర్మిలమ్మా!
నువ్వూ గెలవలేదు.. పైగా టీడీపీ అభ్యర్థిని ఓడించావు షర్మిలమ్మో.. షర్మిలమ్మా!
అవినాష్‌రెడ్డికి 6,05,143 ఓట్లు అంటే, 47.78 శాతం ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి 5,42,448 ఓట్లు అంటే 41.03 శాతం ఓట్లు పడ్డాయి. వైఎస్ షర్మిలకేమో 1,41,039 ఓట్లు అంటే, 10.67 శాతం పడ్డాయి.. అంటే అర్థమేంటి.. షర్మిల పోటీలో నిలవకుండా వుంటే, ఆ ఓట్లు కూడా టీడీపీకి పడి టీడీపీ అభ్యర్థి గెలిచేవాడు. కేవలం షర్మిల పోటీ చేయడం కారణంగానే అవినాష్ రెడ్డి గెలిచాడు. అదీ పాయింటు.
ఉన్న నాలుకకి మందు వేయబోయి కొండ నాలుక ఊడగొట్టావు షర్మిలమ్మో.. షర్మిలమ్మా! జైలుకు వెళ్ళాల్సిన అవినాష్‌రెడ్డిని పార్లమెంటుకు పంపించావు షర్మిలమ్మో.. షర్మిలమ్మా!