చంద్రబాబుకి పోటిగా షర్మిల పాదయాత్ర
posted on Oct 8, 2012 9:02AM
జగన్ కి బెయిల్ వస్తుందని గంపెడు ఆశలతో ఉన్న వైయస్ఆర్ పార్టీశ్రేణులు సుప్రీం తాజా తీర్పుతో డీలా పడ్డారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పాదయాత్రతో జనంలోకి వెళ్లిపోవడంతో దీనికి కౌంటర్‌గా వైఎస్ కూతురు, జగన్ సోదరి షర్మిలతో సుదీర్ఘ పాదయాత్ర చేయించడం మినహా మరో మార్గం లేదని వారు భావిస్తున్నారు. షర్మిల పాదయాత్రకు జగన్ కూడా ఒకే చెప్పారని, ఇక అధికారిక ప్రకటనే తరువాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకటి రెండు రోజుల్లో వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో విజయమ్మ సమావేశం కానున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఓదార్పు యాత్రకన్నా ప్రజాసమస్యలపై షర్మిళ పాదయాత్రకే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే షర్మిళ పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభించాలా లేక మరో ప్రాంతమా అన్న విషయంపైనా త్వరలోనే వైకాపా క్లారిటీ ఇవ్వనుంది.