చెల్లెలి ఉసురు జగన్‌కి తగిలి తీరుతుంది
posted on May 11, 2024 @ 5:07PM
నో డౌట్.. జగన్‌కి తన చెల్లెలు షర్మిల ఉసురు తప్పకుండా తగులుతుంది. అధికారం తుడిచిపెట్టుకుని పోతుంది. సొంత చెల్లి షర్మిల అన్నను విభేదించిన పాపానికి ఆమె మీద సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ చేత నానామాటలు అనిపించాడు జగన్. షర్మిలను అన్ని రకాలుగా అవమానించాడు. సొంత అన్న అయి వుండి, చెల్లెలు కట్టుకున్న చీర మీద కామెంట్లు చేశాడు. చివరికి ఆమె పుట్టుక విషయంలో కూడా దుష్ప్రచారం చేయించాడు. ఇవన్నీ మీడియా ముందు చెప్పుకుని షర్మిల కన్నీరు పెట్టుకుంది. ఇంటి ఆడపిల్ల కంట కన్నీరు పెట్టించిన జగన్ కన్ఫమ్‌గా ఫలితం అనుభవిస్తాడు. పరిస్థితులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే షర్మిలను, జగన్ 16 నెలలపాటు జైల్లో వుంటే, అన్నాళ్ళూ పార్టీని కాపాడిన షర్మిలను, అన్న కోసం పాదయాత్ర చేసిన షర్మిలను ఈ రకంగా అవమానించడం నిజంగా దారుణం. ఈ పాపాలన్నిటికీ ఫలితం అనుభవించడానికి జగన్ మానసికంగా సిద్ధపడాలి.