శాంతి భర్త విదేశాలకు వెళ్లడానికి కారణమిదే
posted on Jul 19, 2024 @ 3:54PM
ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమైన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివాదం రోజుకో ట్విస్ట్ చేరుకుంటుంది. తన బిడ్డకు అడ్వకేట్ సుభాష్ రెడ్డి తండ్రి అని చెబుతున్న శాంతి స్టేట్ మెంట్ పై అనేక అనుమానాలున్నాయి. శాంతి భర్త మదన్ మోహన్ ఇప్పటికే రాష్ట్ర హోం మంత్రి అనితను కల్సితనకు న్యాయం చేయాలన్నారు. శాంతికి పుట్టిన కొడుకు తన బిడ్డ కాదని మొదట్నుంచి మదన్ మోహన్ చెబుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శాంతికొడుకుకు తండ్రి అని ఆయన వాదిస్తున్నారు. తన బిడ్డకు సుభాష్ రెడ్డి తండ్రి అని శాంతి పదే పదే చెబుతున్నిరు. ఎరుకుల కులంలో జన్మించిన శాంతి విడాకులు చెల్లవు. కులాచారం ప్రకారం విడాకులు తీసుకున్నట్లు శాంతి పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కులాచారం ప్రకారం విడాకులు చెల్లవు. శాంతి ప్రెస్ మీట్ లో కన్నీరు మున్నీరు కావడం పలువురిని కలచి వేసినప్పటికీ చట్ట ప్రకారం ఈ విడాకులు చెల్లవు. న్యాయవాదిగా పనిచేసిన శాంతికి ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ఓవర్ సీస్ స్కీం క్రింద ఎస్ టి కులానికి చెందిన శాంతి కి విదేశాలు వెళ్లడానికి అవకాశ మొచ్చింది. అప్పట్లో నిరుద్యోగి అయిన శాంతి విదేశాలకు వెళ్లాల్సి ఉంటే ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త మదన్ మోహన్ విదేశాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. నిరుద్యోగి అయిన శాంతి కూడా ఈ స్కీంలో అర్హత ఉన్నప్పటికీ మదన్ మోహన్ విదేశాలకు వెళ్లారు. భర్త మదన్ మోహన్ ను విదేశాలకు వెళ్లడానికి శాంతితో వైకాపా నేత అక్రమ సంబంధమే అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త అయిన మదన్ మోహన్ ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఓవర్సీస్ స్కీం వర్తించదు. దారిద్యరేఖకు దిగువ ఉన్న వారికి ఈ స్కీం వర్తిస్తుంది. భార్యను మదన్ మోహన్ ను విదేశాలకు వెళ్లడానికి వైకాపా నేత విజయసాయి రెడ్డి ప్రోద్బలమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి.