అడ్వకేట్ జనరల్‌ని సాగనంపండి: షబ్బీర్ డిమాండ్
posted on Jul 1, 2014 @ 11:21AM
అడ్వకేట్ జనరల్‌ని సాగనంపండి: షబ్బీర్ డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ఎ.జి. (అడ్వకేట్ జనరల్)గా నియమించిన రామకృష్ణారెడ్డిని తక్షణం రీ-కాల్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో వాదించిన న్యాయవాది రామకృష్ణారెడ్డిని అడ్వకేట్ జనరల్‌గా ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తే రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారని షబ్బీర్ ఆ లేఖలో గుర్తు చేశారు. ముస్లింలకు అసలు రిజర్వేషన్లు అవసరం లేదని, 4 శాతం రిజర్వేషన్లు కూడా అవసరం లేదని రామకృష్ణా రెడ్డి వాదించారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ముస్లిం వ్యతిరేకి అయిన వ్యక్తిని తెలంగాణ అడ్వకేట్ జనరల్‌గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు.