అమ్మాయిలు స్కర్టులు వేసుకుంటారా.. నేనొప్పుకోను!
posted on Jul 1, 2014 @ 1:28PM
గోవా అంటేనే ఫుల్ ఎంజాయ్.. ఆ ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోతే గోవాని పట్టించుకునేవారే వుండరు. అయితే గోవాలోని నైట్క్లబ్బులకు వచ్చే అమ్మాయిలు స్కర్టులు వేసుకొస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని గోవా మంత్రి మంత్రి సుదీన్ దావలికర్ అంటున్నారు. అమ్మాయిలు పొట్టి స్క్రర్టులు వేసుకుని పబ్బులకు, క్లబ్బులకు రావడం గోవా సంస్కృతికి ప్రమాదకరంగా మారిందని ఆయన వాపోయారు. ఎక్కడపడితే అక్కడ ఇలా పొట్టి స్కర్టులు వేసుకు రావడం గోవా సంస్కృతికి ఎంతమాత్రం కాదని, ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే మన గోవా ఏమైపోవాలని.. తమ ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని మంత్రి అన్నారు. అలాగే శ్రీరామసేన (ఎస్ఆర్ఎస్) అధినేత ప్రమోద్ ముతాలిక్ కూడా ఆమధ్య ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గోవాలో డ్రగ్స్, సెక్స్, నగ్న నృత్యాలను నిరోధించి.. భారతీయ సంస్కృతిని కాపాడాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ముతాలిక్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని దావాలికర్ చెప్పారు.