పలు రైళ్ళు రద్దు.. వివరాలు ఇవిగో..!
posted on Sep 1, 2024 @ 11:10PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులన్నీ జలమయం కావడంతోపాటు వర్షపు నీరు రైల్వే ట్రాకులమీదకి చేరింది. కేసముద్రం సమీపంలో రైల్వే ట్రాక్ వరద ధాటికి కొట్టుకుపోయింది. దీంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ట్రాక్ మరమ్మతు పనులను ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీలైనంత త్వరగా ఈ మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. వర్షాలు తగ్గినట్టయితే సోమవారం సాయంత్రానికి ఈ మార్గం అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతూ వుండటంతో సోమ, మంగళ, బుధవారాల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొన్ని రైళ్లను దారి మళ్ళిస్తున్నట్లు తెలిపింది.
సోమవారం నాడు ప్రయాణించాల్సిన మచిలీపట్నం - విశాఖపట్టణం మధ్య నడిచే 17219 నెంబర్ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. రైలు నెంబర్ 17247 ధర్మవరం - మచిలీపట్నం, రైలు నెంబర్ 17256 లింగంపల్లి - నరసాపురం, రైలు నెంబర్ 17248 ధర్మవరం - నరసాపురం, రైలు నెంబర్ 17209 బెంగళూరు - కాకినాడ టౌన్ రైళ్ళను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
అలాగే ఇప్పుడు తెలిపే రైళ్ళను సోమవారంతోపాటు మంగళవారం నాడు కూడా రద్దు చేశారు. రైలు నెంబర్ 07788 గుంటూరు-విజయవాడ, రైలు నెంబర్ 07783 విజయవాడ - గుంటూరు, రైలు నెంబర్ 07580 మాచర్ల - నడికుడి, రైలు నెంబర్ 07779 గుంటూరు - మాచర్ల, రైలు నెంబర్ 07579 నడికుడి - మాచర్ల, రైలు నెంబర్ 07780 మాచర్ల - గుంటూరు, రైలు నెంబర్ 07276 కాచిగూడ-మిర్యాలగూడ, రైలు నెంబర్ 07277 మిర్యాలగూడ - నడికుడి రైళ్ళను రెండు రోజులపాటు రద్దు చేశారు. అలాగే సోమ, మంగళ, బుధవారాలలో రైలు నెంబర్ 07974 మిర్యాలగూడ- నడికుడి, రైలు నెంబర్ 07973 నడికుడి - మిర్యాలగూడ రైళ్ళను రద్దు చేశారు.
మరికొన్ని వివరాలు ఇవిగో...