సెల్ఫీ సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది..
posted on Jul 6, 2021 @ 3:12PM
అప్పుడప్పుడు మనం చేసిన చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు పడుతుంటాయి. కొన్ని కొన్ని సార్లు మన ప్రాణాలు కోలుపోవచ్చు కూడా..ఈ మధ్య కాలంలో సరదాకి వెళ్లి ఉత్తి పుణ్యానికి ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో ముఖ్యంగా స్మార్ట్ వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి. అదెలా అంటారా ? ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం.. రోడ్డు క్రాస్ చెయ్యడం. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం లాంటివి ఒక ఎత్తు అయితే సెల్ఫీ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఒక ప్రాణాలు పోవడమే కాదు.. టైం వెస్ట్ అవుతుంది. ఎనర్జీ పోతుంది.. రేడియేషన్ వస్తుంది. లేనిపోనీ రోగాలు అని ఈ స్మార్ట్ ఫోన్ తో వస్తున్నాయంటే నమ్మాల్సిందే.. తాజాగా సెల్ఫీ సరదా ముగ్గురి ప్రాణాలను బలిగొంది.
ఓపెన్ చేస్తే.. అది తెలంగాణ. నిర్మల్ జిల్లా. సింగన్‌గావ్ గ్రామం. ముగ్గురు యువతులు సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ముథోల్ సీఐ అజయ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. సింగన్‌గావ్‌కు చెందిన ఎల్మే దాదారావు, మంగళాబాయిలకు ఒక కుమారుడితో పాటు ఇద్దరు కుమార్తెలు స్మిత(16), వైశాలి(14) ఉన్నారు. ఆదివారం ఆన్‌లైన్ క్లాసులు లేకపోవడంతో బంధువుల అమ్మాయి అంజలి (14)తో కలిసి స్మిత, వైశాలిలు చేనుకు వెళ్లారు. ఎండ ఎక్కువగా ఉండటంతో ఇంటికి వెళ్లాలని వారికి మంగళబాయి చెప్పింది. కొద్దిసేపు చేనులో ఉండి సెల్ఫీలు తీసుకుని ఇంటికి బయలుదేరారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు.. ఒక్కసారిగా మార్గంమధ్యలో ఉన్న చెరువు గట్టు చూశారు. ఆ టైం లో వల్ల నేత్తిలో శని ప్రవేశింశాడు.. చెరువు వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకునేందుకు యత్నించారు. అంతే పక్కనే యముడు పాశం వదిలినట్టు ఆ ముగ్గురు ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మునిగిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కాపాడలేకపోయారు. చేను నుంచి రాత్రి ఇంటికి తిరిగివచ్చిన మంగళబాయికి ముగ్గురమ్మాయిలూ కనిపించలేదు. బంధువుల ఇళ్లలో, పంట చేను సమీపంలో వెతికారు. ఎంత వెతికిన కనిపించకపోయే సరికి కరఁగారు పడిన తల్లిదండ్రులు చివరికి అర్ధరాత్రి తానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కట్ చేస్తే.. సోమవారం ఉదయం చెరువు గట్టు వద్ద చెప్పులు కనిపించాయి. అసలే రోజులు బాగాలేవు అని అనుమానం తో ఆ చెప్పులను గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. వారి సాయంతో ముగ్గురి మృతదేహాలను బయటకు తీయించారు. స్మిత, వైశాలిలది వ్యవసాయ కుటుంబం. తండ్రి దాదారావు ఆటో నడుపుతాడు. సోదరుడు సందీప్ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. స్మిత హైదరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇంటర్, వైశాలి బాసరలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. మహారాష్ట్ర ముఖేడ్‌కు చెందిన లహుబందే ప్రకాశ్, ప్రియాంకల కుమార్తె అయిన అంజలి అక్కడే 9వ తరగతి చదువుతోంది.