అవినీతిలో ఎంత ఘనమైతే....
posted on Oct 5, 2012 8:56AM
కుంభకోణాల్లో మీరు కాని, అవినీతి కేసుల్లో మీ పేరు కాని ఉండి కొన్ని నెలలు జైలు జీవితం అనుభవించి.. బయటకు వచ్చారా? అయితే వెంటనే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను సంప్రదించండి. మీకు అత్యున్నతమైన పదవులు కాని, హోదాకాని లభించే అవకాశం ఉంది....! నేటి భారతంలో జరుగుతున్న రాజకీయ క్రీడ ఇది. ఎవరిపై ఎన్ని ఎక్కువ అవినీతి ఆరోపణలుండి, వారి పాత్ర ఉందని ఎంత ఎక్కువగా రుజువైతే... రాజకీయాల్లో అంత ఎక్కువ పబ్లిసిటీ.! అధికారంలో ఉండాలంటే... అవినీతివీరులను పక్కనే జేర్చుకోవాలలి... లేదా..వారికి మరేదైనా ఉన్నత గౌరవం కట్టబెట్టాలి... అప్పుడే ప్రభుత్వానికి మనుగడ..! అంతేకాని అవినీతిమయంగా మారిన ప్రభుత్వాన్ని నడిపే కంటే తిరిగి ఎన్నికల్లో పాల్గొని గెలిచిన, ఓడినా హుందాగా వైదొలగాలని ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవడం ఏదీ ముఖ్యమంటే... మాకు అధికారమే ముఖ్యం. ప్రజలు మా అవినీతిని ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు. కొన్నిరోజులకు మరచిపోతారు... ఎన్నికలొస్తే తిరిగి మేమే ఎన్నికవుతాం. అందుకు మా లెక్కలు మాకుంటాయి.. అంటారు...! లేకుంటే కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో ఆరోపణులుఎదుర్కొని తొమ్మిది నెలలు జైలు జీవితం అనుభవించిన కాంగ్రెస్ ఎం.పి. సురేష్ కల్మాడీ, 2జి కుంభకోణంలో సంవత్సరం పైగా జైలు జీవితం అనుభవించి బెయిల్‌పై విడుదలైన డిఎంకె ఎం.పి. ఎ. రాజాలను పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యులుగా నియమించడం చూస్తే పాలకులు ప్రజలకు తప్పుదోవలో నడిస్తే అందలం ఎక్కవచ్చునన్న సంకేతాలుపంపుతున్నట్లుగా ఉందని సగటు మనిషి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.