భారత్- పాక్ మ్యాచ్ పై సానియా మీర్జా సంచలన కామెంట్స్...
posted on Oct 26, 2021 @ 4:31PM
టీట్వంటీ వరల్డ్ కప్ లో కోహ్లీ సేన పై పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ భారత్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.భారత్ కనీస పోటీ ఇవ్వకపోవడంతో కోహ్లీ సేనపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. సోషల్ మీడియాలో తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. భారత మాజీ క్రికెటర్లు, అనలిస్టులు కూడా భారత ఓటమిపై తమదైన విశ్లేషణులు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో భారత్, పాకిస్తాన్ అభిమానుల మధ్య వార్ కూడా సాగుతొంది. పాక్ గెలుపుపై అక్కడి రాజకీయ నేతలు చేస్తున్న కామెంట్లు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా భారత్ - పాక్ మ్యాచ్ పై స్పందించారు భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ సానియా మీర్జా. తన భర్త షోయబ్ మాలిక్ ను ‘జిజాజీ’ లేదా బావ అని అభిమానులు పిలిచిన వైరల్ వీడియోపై సానియా మీర్జా తాజాగా వ్యాఖ్యానించింది.
ఆదివారం భారత్ తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అభిమానుల గుంపు ‘జిజా జీ’ అని నినాదాలు చేసింది. షోయబ్ మాలిక్ 2010లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని పెళ్లాడినప్పటి నుంచి అభిమానులు మ్యాచ్ జరుగుతున్నపుడు జిజా జీ పదాన్ని తరచుగా ప్రస్తావిస్తున్నారు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగినప్పటి నుంచి తొమ్మిది సెకన్ల క్లిప్ ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తోంది. ఇది మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో 4 లక్షలకు పైగా వ్యూస్ ను సంపాదించింది. ఈ వీడియో సానియా మీర్జా దృష్టిని కూడా ఆకర్షించింది.ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ సానియా మీర్జా నవ్వుతో కూడిన రెండు ఎమోజీలు, రెండు హృదయాల ఎమోజీలతో స్పందించారు. ‘‘క్రీడాస్ఫూర్తి, సహృదయత యొక్క ఈ ప్రదర్శనను పలువురు ప్రశంసించారు.’’ అని సానియామీర్జా సమాధానం ఇచ్చారు.