సాక్షి పత్రికకు నోటీసులు
posted on Mar 22, 2013 8:02AM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం.వి. మైసూరా రెడ్డి స్పీకర్‌ని ఉద్దేశించి చేసిన కొన్ని అనుచితమయిన వ్యాక్యలను ఆ పార్టీ అధినేతకు చెందిన సాక్షి దిన పత్రికలో యధాతధంగా ప్రచురించి సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు శాసనసభ అభిప్రాయపడటంతో సభ కార్యదర్శి రాజా సదారాం సాక్షి దిన పత్రిక ఎడిటర్‌కు నిన్న నోటీసులు జారీ చేస్తూ దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో ఒక పత్రికకు నోటీసులు జారీ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చును.