సచిన్ కి పాజిటివ్!
posted on Mar 27, 2021 @ 11:32AM
చట్టానికి ఎవరు అతిథులు కారు అన్నట్లు అని ఎలా అయితే చెప్పుకుంటామో. కరోనా కి కూడా ఎవరు అతిథులు కారు. అది బెంజులో తిరిగేవరైనా గంజి నీళ్లు తాగేవారైనా.. అందరూ కరోనా కాటు భారీన పడాల్సిందే. సంవత్సరం ప్రపంచాన్ని వణికించిన కరోనా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది.. ఈ ఇన్నింగ్ లో ముఖ్యంగా సెలబ్రెటీలు బాగా గురవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటులు ఆమీర్ ఖాన్, మాధవన్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా క్రికెట్ దిగ్గజం, మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కరోనా భారీన పడ్డాడు. కరోనా పరీక్షలో సచిన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సచిన్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాను. కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో తాజాగా మరోసారి పరీక్ష చేయించుకున్నా. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మా ఇంట్లో మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చింది. నేను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. నాకు మద్దతుగా నిలుస్తున్న వైద్య సిబ్బందికి, దేశవ్యాప్తంగా ఉన్న నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండ`ని సచిన్ ట్వీట్ చేశాడు.
ఇది ఇలా ఉండగా లింగం మాయ్యా కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.. లింగం మాయ్యా అంటే ఎవరని అనుకుంటున్నారా అందేనండి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మామ పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కరోనా బారిన పడ్డారు. షూటింగ్ సమయంలో నీరసంగా ఉండటంతో టెస్ట్ చేయించుకున్నాడు. దీంతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ ఉంది. డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు.