జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త పార్టీ ?

 

 

 

కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి త్వరలో తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు ప్రస్తుతం జాతీయ మీడియాలో కూడా వస్తున్నాయి. తన శాఖ మార్చడంఫై తీవ్ర అసంతృప్తితో ఉండటంతో పాటు, రాజీనామా చేయాలని ఆయనఫై తెలంగాణా వాదుల నుండి కూడా వత్తిడి పెరుగుతోంది.


అయితే, సరైన సమయంలో ఈ విషయంలో నిర్ణయం తీసుకొంటాననే సంకేతాలు ఆయన ఇస్తూ వచ్చారు. నెల రోజుల్లోపు హోం మంత్రి షిండే చేస్తానన్న ప్రకటన తెలంగాణా కు అనుకూలంగా లేకపోతే రాజీనామా చేస్తానని ఆయన తమతో అన్నారని పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ ప్రకటన కూడా ఇచ్చారు.

ప్రత్యెక రాష్ట్రమే తమకు ముఖ్యమని, ఎలాంటి ‘ప్యాకేజీ’ లకు తాము ఒప్పుకోమని తెలంగాణా ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యులు అంటున్నారు.ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే,తెలంగాణా ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యులంతా కలిసి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణా అజెండాగా ఆ పార్టీ ఉంటుందని వారు  అంటున్నారు. తెలంగాణా ఏర్పడకపోతే, తాము కాంగ్రెస్ లో కొనసాగలేమని వారు భావిస్తున్నారు. అయితే, నెల రోజుల్లోపు కేంద్రం తీసుకొనే నిర్ణయంఫైనే ఈ పరిణామాలు ఆధారపడిఉన్నాయి.

Teluguone gnews banner