రౌండప్ 2022.. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం
posted on Dec 27, 2022 @ 12:24PM
సెప్టెంబర్
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే..
సెప్టెంబర్1..
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఆ పార్టీ నేతలు వెల్లడించారు. సెప్టెంబర్ 22న పార్టీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ రానుంది. 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. 19న కౌంటింగ్ జరగనుంది. రెండు రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సెప్టెంబర్ 9... భారత్ జోడి యాత్రలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, 41 వేల రూపాయల విపువచేసే, బ్రాండెడ్ టీషర్టు’ వేసుకున్నారని బీజేపీ ఆరోపించింది. దీంతో ఇరు పార్టీల మది ట్వీట్ల యుద్ధం మొదలైంది.
సెప్టెంబర్ 11.. తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఎసి వెంబడి చివరి ఘర్షణ పాయింట్ నుండి భారత్, చైనా దళాలు వైదొలగుతున్నాయని ఉభయ దేశాలు ప్రకటించిన నేపధ్యంలో మాజీ ఆర్మీ చీఫ్ వేద్ మాలిక్, చైనాతో మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని, అన్నారు. గతంలో చైనా సరిహాద్దు ఒప్పందాలను అనేకమార్లు ఉల్లంగించిన విషయన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సెప్టెంబర్ 15... ఉజ్బెకిస్తాన్ లోని సమార్ఖండ్ లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్’ ఆర్గనైజేషన్ ( ఎస్సీఓ) సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాద్మిర్ పుతిన్’ , చైనా అధ్యక్షుడు జిన్’పింగ్` తో భేటీ అవుతారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్’తో మోడీ సమావేశం కావడం ఇదే తొలిసారి కావడంతో ఈ భేటి ప్రధాన్యతను సంతరించుకుంది. కాగా, ఎస్సీఓ సదసుల్లో ప్రసంగించిన మోడీ, భారత దేశం స్టార్టప్’ కంపెనీల ప్రగతితో ఉత్పాదక కేంద్రంగా రూపాంతరం చెందుతోందని వివరించారు.
సెప్టెంబర్ 17.. ప్రధాని నరేంద్ర మోడీ 72 వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సహా పలువురు కేంద్రమంత్రులు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పారు.అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఇక ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు దేశవ్యాప్తంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.
సెప్టెంబర్ 17... తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ వేడుకలను తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్‌లో కలిసిన 1948 సెప్టెంబర్ 17న అప్పటి హోంశాఖమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పతాకం ఆవిష్కరించగా.... ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. కాగా, గడచిన ఎనిమిది సంవత్సరాలలో తెలంగాన విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి జాతీయ సమైక్యతా దినంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలను నిర్వహించింది.
భారతదేశంలో అంతరించిపోయిన అడవి చిరుతలను తన పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కునో జాతీయ పార్కులో విడుదల చేశారు. ప్రపంచంలోనే మొదటి ఖండాంతర అతిపెద్ద మాంసాహార జంతువుల మార్పిడి ప్రాజెక్టు "ప్రాజెక్ట్ చీతా" కింద నమీబియా నుండి ఈ చిరుతలను భారతదేశానికి తీసుకురావడం జరిగింది. మొత్తం ఎనిమిది చిరుతల్లో ఐదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి.
సెప్టెంబర్ 19... పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్’ బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు
.సెప్టెంబర్ 19.. .కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు.
సెప్టెంబర్ 25...రాజస్థాన్ ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తింది. ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్’ స్థానంలో పీసీసీ మాజీ అధ్యక్షడు సచిన్ పైలట్’ను ముఖ్యమంత్రిగా నియమించేందుకు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గేహ్లోట్ వర్గానికి చెందిన 80 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.