చంద్రబాబు కాదు ఆయన బాబు తరం కాదు.. రోజా
posted on Oct 8, 2015 @ 3:31PM
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష రెండోరోజుకు చేరింది. ఈ దీక్ష సందర్భంగా ఆపార్టీ ఎమ్మెల్యే రోజా టీడీపీపై మండిపడ్డారు. తమ పార్టీనేత చేపట్టిన దీక్షను చూసి టీడీపీ నేతలు మైండ్ బ్లాక్ అయిందని విమర్శించారు. జగన్ దీక్షను ఆపడం చంద్రబాబు వల్లకాదు కదా ఆయన బాబు వల్ల కూడా కాదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా అంటే అధికార పార్టీకి పచ్చిమిరపకాయలు తిన్నట్టు మంటెక్కిపోతున్నారని.. అందుకే వారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ఒక్కొక్కరూ కాదు వంద మంది టీడీపీ నేతలు వచ్చి విమర్శించినా... తమ పార్టీ లెక్క చేయదని అన్నారు. అసలు ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు అనుకూలమో లేక వ్యతిరేకమో చెప్పే దమ్ము ధైర్యం లేవన్నారు.