హరీష్ రావును కేసీఆర్ సైలెంట్ గా తప్పిస్తున్నాడా?
posted on Oct 8, 2015 @ 4:46PM
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావును చూసి ఇప్పుడు అందరూ జాలీ పడుతున్నారట. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడైన హరీష్ రావును పదవి నుండి తప్పించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అది అటో ఇటో అనే విషయం ఒక వారంలో తెలియనుంది. ఇంత సడెన్ గా హరీష్ రావును పదవి నుండి ఎందుకు తప్పిస్తున్నట్టు.. టీఆర్ఎస్ పార్టీలో మంచి వాక్చాతుర్యం ఉండి.. మంచి బలమైన నాయకుడిగా మంచి పేరు ఉన్న హరీశ్ రావును పదవి నుండి తప్పిండానికి గల కారణాలు ఎంటని ఆలోచిస్తున్న అందరికి అంత పెద్ద సమాధానాలు కూడా ఏం కనిపించకపోవచ్చు. ఎందుకంటే అది కేవలం హరీష్ రావు నాయకత్వానికి కేసీఆర్ భయపడటమే అని అర్ధమవుతోంది.
గత కొద్దిరోజులుగా కేసీఆర్ కుటుంబానికి.. హరీష్ రావుకు మధ్య అభ్యంతరాలు తలెత్తినట్టు వార్తలు వింటూనే ఉన్నాం. అందుకు కారణం హరీష్ రావుకు బలమైన నాయకత్వం ఉంటబట్టే. ఓ రకంగా చెప్పాలంటే తరువాత కేటీఆర్ కు కాని.. కూతురు కవితకు కాని అంత బలమైన నాయకత్వపు లక్షణాలు లేవు.. కేసీఆర్ తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించగల వ్యక్తి హరీష్ రావు. అందుకే ఈ భయంతోనే కేసీఆర్ ఎక్కడ తనను మింగేస్తాడో అని.. తన కొడుకు కేటీఆర్ ప్రభావం హరీశ్ వల్ల ఎప్పుడూ దిగువగానే ఉండటంతో వీటిని దృష్టిలో పెట్టుకొని తాను హరీష్ ను పదవి నుండి తొలగించాలని ఆలోచించినట్టు తెలుస్తోంది.
మరి హరీష్ రావును మంత్రి పదవి నుండి తొలగిస్తే తాను ఊరుకుంటాడా.. తను వేరే పార్టీ నిలవగల సత్తా ఉన్న మనిషి. అందుకు కేసీఆర్ చాలా తెలివిగా ఆలోచించి టీఆర్ఎస్ కు ఒక ప్రజా నేత కావాలంటూ.. పార్టీని బలోపేత చేయగల మంచి చరిష్మా ఉన్న నాయకుడు కావాలంటూ.. దానికి హరీశ్ రావు అయితే కరెక్ట్ అని వెన్న పూసినట్టి పదవి నుండి తప్పించి ప్రధాన కార్యదర్శిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి కొనసాగిస్తూ ఈ బాధ్యత చేపట్టాలంటే కష్టం.. గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేసి అన్ని స్థాయిల్లోనూ కార్యకర్తలకు జవజీవాలు కల్పించాలంటే ఆ పదవిలో ఉంటూ చేయడం కష్టం అందుకే మంత్రి పదవి నుండి తప్పించి ఇలా హరీష్ కు ఐస్ పూస్తున్నారు కేసీఆర్. మొత్తానికి కేసీఆర్ ఎత్తుగడలకు పాపం హరీశ్ కూడా బలైపోతున్నాడని కొంత మంది నేతలు అనుకుంటున్నారు. అయితే రాజకీయంగా ఎన్నో చూసినా హరీష్ రావుకు తన మామ తనపై ప్రయోగించే తంత్రాలను తెలుసుకోలేరు అని కూడా అనుకోలేం. చూద్దాం ఈ వారం రోజుల్లో ఏం జరుగుతుందో.