కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 14 మంది దుర్మరణం
posted on Feb 14, 2021 8:43AM
విశాఖపట్నం జిల్లా అరకు లోయలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన మరవకముందే.. కర్నూల్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఓ టెంపో రహదారిపై అదుపు తప్పి, కుడివైపునకు పడిపోయింది. అదే సమయంలో అటు వైపుగా వస్తున్న ఆ దిశగా లారీ టెంపోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు 8 మంది మహిళలు ఉన్నారు. టెంపో డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.