కేసీఆర్-జగన్ WWF డూప్ ఫైట్!.. ఆ ముగ్గురినీ ఏకిపారేసిన రేవంత్..
posted on Jul 4, 2021 @ 2:19PM
ఏ డైలాగ్ అయినా రేవంత్‌రెడ్డి నోటి నుంచి వస్తే ఆ కిక్కే వేరప్ప. ఏ విమర్శ అయినా.. రేవంత్ చేస్తే ఆ స్పైసీనెస్ వేరు. మాటలతో తూట్లు పొడవాలన్నా.. విషయాన్ని విడమరిచి చెప్పాలన్నా.. రేవంత్‌రెడ్డి తర్వాతే ఎవరైనా. ఇక ఇంటర్నల్ మేటర్స్ రివీల్ చేయడంలో ఆయనే ఎక్స్‌పర్ట్. అందుకే, రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యారు. ఇక రాజకీయ వేట మొదలెట్టేశారు. తాజాగా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదంపై తనదైన స్టైల్‌లో విమర్శలు గుప్పించారు. కేసీం కేసీఆర్, సీఎం జగన్‌లది ఉత్తుత్తి ఫైట్ అంటూ తీసిపారేశారు.
‘‘నీళ్ల విషయంలో కేసీఆర్-జగన్‌ది WWF ఫైట్ లాగా ఉంది. ఇదో డూప్ ఫైట్. వాళ్లిద్దరికి నీళ్లు... ఓట్లు, నోట్లు కురిపించే ఏటీఎంలా మారాయి. రాజకీయ ప్రయోజనం కోసం వివిధ ప్రాంతాల ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. ప్రశాంతంగా బతుకుతున్న వాళ్లను ఇబ్బందులు పెడుతున్నారు.’’ అంటూ రేవంత్‌రెడ్డి కాక రేపారు.
ఇక సీఎం జగన్‌ను ఓ ఆటాడుకున్నారు రేవంత్‌రెడ్డి. జగన్‌ను, వైఎస్సార్‌ను గజ దొంగ, నీళ్ల దొంగ అని తిడుతుంటే.. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కానీ, సీఎం జగన్ కానీ స్పందించకపోవడం ఏంటని నిలదీశారు. రాజకీయాల్లో ఎన్టీఆర్, వైస్సార్ ఒక శకమని, వారిద్దరూ రాజకీయాలకు అతీతమన్నారు రేవంత్‌రెడ్డి. తెలంగాణలో సీమాంధ్ర ప్రాంత వాసులున్నారని, వారి కోసం సమయంనం పాటిస్తున్నానని ఏపీ సీఎం జగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలోని సీమాంధ్రులకు రక్షణ కోటగా తాను, కాంగ్రెస్ పార్టీ ఉంటామన్నారు రేవంత్‌రెడ్డి.
ఇక, తనకు పీసీసీ చీఫ్ ఇప్పించింది చంద్రబాబేనంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లపైనా రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డి తిక్కలోడు.. ఆయనది శునకానందం.. రాజకీయంగా అణాపైసా విలువ చేయడు.. అంటూ ఓ రేంజ్‌లో మండిపడ్డారు. చంద్రబాబుకి పీసీసీ పదవీ ఇప్పించగలిగే శక్తి సామర్థ్యాలున్నాయని విజయసాయి ఒప్పుకుంటున్నారా? అని ప్రశ్నించారు.