మహారాష్టలో రిజర్వేషన్ రగడ ...
posted on May 28, 2021 @ 2:37PM
ఓ వంక రాష్ట్రంలో కొవిడ్ కరల నృత్యం కొనసాగుతోంది.దేశం మొత్తంలో కొవిడ్ కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర ముందువరసలో వుంది. అదలా ఉంటే, కొవిడ్’ను మించిన మరో చిచ్చుకుకు రాజకీయ పార్టీలు తెరతీశాయి. విద్యా ఉద్యోగాలు, మరాఠీలకు రాష్ట్ర ప్రభుత్వం కలిపించిన ఐదు శాతం రిజర్వేషన్ కోటాను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లను విచారించిన సర్వోన్నత నాయస్థానం, మే 5 న కోటాను రద్దు చేస్తూ తీర్పు నిచ్చింది.ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీజీపే, అనుబంధ సంస్థలు, బీజేపీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు రిజర్వేషన్ రాజకీయాలకు తెరతీశాయి. బీజేపీ మిత్ర పక్షం అనుబంధ సంస్థ. జూన్ 5 నుంచి ఆందోళనకు పిలుపు నిచ్చింది. మరో వంక రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, గురువారం, రిజర్వేషన్ పరిరక్షణ కోసం మరాఠీలు అందరూ, వీధుల్లోకి వచ్చి, ఆందోళనలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. అయితే రిజర్వేషన్ అనుకూల, వ్యతిరేక పత్రాలు రెండూ కూడా బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలే పోషిస్తున్నాయని, కాంగ్రెస్, పార్టీ ఆరోపిస్తోంది. అంతే కాకుండా ఈ ఆందోళన, కొవిడ్ మరింత వేగంగా విస్తరిస్తే, అందుకు బీజేపపీనే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటీషన్ దకాహాలు చేసింది బీజేపీ,ఆర్ఎస్ఎస్’ తో సంబంధమున్న సంస్థలైతే, రిజర్వేషన్ల సాధన పేరిట బీజీపీ ఎంపీ,సంబాజీరాజే చత్రపతి, రాజకీయేతత ఆందోళన చెప్పటడం, కాంగ్రెస్ తప్పుపడుతోంది. కాగా, బీజేపీ ఎంపీ, శంబాజీరాజే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా, అధికార మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఏమ్వీఎ)భాగస్వామ్యపక్షాల నాయకులతోను చర్చలు,సంప్రదింపులు జరుపుతున్నారు.
అయితే,మరాఠీల కోటాను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో, ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉందని , ఏమ్వీఎ ప్రభుత్వం వాదిస్తోంది, మరోవంక బీజేపీ రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో బలమైన వాదనలు వినిపించక పోవడం వల్లనే తీర్పు ప్రతికూలంగా వచ్చిందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేయాలని డిమాండ్ చేస్డింది. రెవీ పిటీషన్’కు జున 4 వ తేదీ వరకు సమయముందని, అయినా ప్రభుత్వం కదలకపోతే, జూన్ 5 నుంచి ఆందోళన తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్పాటిల్ హెచ్చరించారు. మరోవంక అనేక కుల సంఘాలు జూన్ 5 లోగా రిజర్వేషన్ల పునరుద్దరణ జరగాలని లేదంటే కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి అయినా వీధుల్లోకి వచ్చి , ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాయి.
అయితే రిజర్వేషన్ మంచి చెడులు ఎలా ఉన్నప్పటికీ, కొవిడ్ మహమ్మారి ఉదృతి పూర్తిగా తగ్గని ప్రస్తుత పరిస్థితులలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఆందోళనకు పిలుపు ఇవ్వడం మంచిది కాదని, సొంత పార్టీ నేతలే హితవు చెపుతున్నారు. అలాగే, కోర్టులు కూడా సుమోటోగా జోక్యం చేసుకోవాలని కూడా కోరుతున్నారు.