గేదెను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు..
posted on Jul 23, 2021 @ 5:19PM
ఎవరైనా సెలెబ్రెటీ ని ఇంటర్వ్యూ చేస్తారు. రాజకీయనాయకులను ఇంటర్వ్యూ చేస్తారు.. లేదంటే లైఫ్ లో ఏదైనా సాధించిన వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తారు.. కానీ తాజాగా ఒక వ్యక్తి ఏకంగా గేదెను ఇంటర్వ్యూ చేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు..? అతను గేదెను ఎందుకు ఇంటర్వ్యూ.. అతను అడిగిన ప్రశ్నలకు ఆ గేదె ఏమని సమాధానం చెప్పింది. అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మారేందుకు ఆలస్యం పదండి ముందుకి..
అతని పేరు అమిన్ హఫీజ్అ. అతను ఒక విలేకరి వస్తువులను జంతువులను ఇంటర్వ్యూ చేస్తూ అప్పుడప్పుడు నవ్విస్తూ ఉంటాడు. తాజాగా అతడు లాహోర్‌లో ఓ గేదెను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకి ఎక్కాడు. మనుషులను ఇంటర్వ్యూ చేయడం రొటీన్.. జంతువులను, వస్తువులను ఇంటర్వ్యూ చేయడం వెరైటీ అంటున్నారు ఔనండి.. అతను ట్రెండ్ ఫాలో ఎవ్వడు సెట్ చేస్తున్నాడు.. అన్నింటికీ మించి అక్కడ ఇదోరకమైన ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వెంటకారం అనుకోవాలో.. వ్యంగ్య బాణాలు అనుకోవాలో తెలియదుగానీ.. వారు అలాంటి ఇంటర్వ్యూలతో టీవీ చానెళ్లకు కావాల్సిన టీఆర్పీ ర్యాటింగులను బాగానే తెచ్చిపెడుతున్నారు. ముఖ్యంగా అమిన్ హఫీజ్ అనే విలేకరి ఈ విషయంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇలాంటి ఐడియాలు టీవీ టీఆర్పీ ర్యాటింగులను పెంచడానికి అని స్థానికులు అనుకుంటున్నారు.
తాజాగా అతడు లాహోర్‌లో ఓ గేదెను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకి ఎక్కాడు. గేదెలను విక్రయించే ఓ మార్కెట్‌లోకి వెళ్లిన అమిన్ ఓ గేదె వద్ద చిన్న మైకును పుట్టుకుని ప్రశ్నలు అడిగాడు. ‘‘మీరు లహోర్ వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తోందో చెప్పండి’’ అని ఆ గేదెను ప్రశ్నించాడు. ఇందుకు ఆ గేదె తనదైన భాషలో ‘‘అంబా’’ అని అరిచింది. దీంతో అమిన్ కెమేరా వైపు తిరిగి.. ‘‘చూశారా.. గేదెకు లాహోర్ నచ్చిందట’’ అని తెలిపాడు. ఆ తర్వాత ‘‘నీకు లాహోర్‌లో ఆహారం ఎక్కువ నచ్చిందా? లేదా మీ గ్రామంలో ఆహారం రుచిగా ఉంటుందా?’’ అని ప్రశ్నకు కూడా ఆ గేదె మరో సారి ‘‘అంబా’’ అని సమాధానం ఇచ్చింది. దీంతో అతడు ‘‘గేదెకు లాహోర్‌లో ఆహారం బాగా నచ్చిందట’’ అని తెలిపాడు. ఈ వీడియో క్లిప్‌ను మరో జర్నలిస్ట్ నైలా ఇనయత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదైమైనా క్రియేటివిటి అంటే హద్దు అదుపులేకుండా పోతుంది. హఫీజ్ 2016లో కూడా పసువులను ఇంటర్వ్యూ చేసి అమిన్ వైరల్ అయ్యాడు. 2018లో గాడిదలకు, మనుషులకు ఉండే స్నేహం గురించి వివరించేందుకు గాడిదపై కూర్చొని సవారి చేశాడు. జియో (Geo) టీవీ ఉర్దు రిపోర్టర్‌గా పనిచేస్తున్న అమీన్ కొద్ది రోజుల కిందట ఓ చారిత్రాత్మక కట్టడం గురించి చెప్పేందుకు.. ఏకంగా రాజు అవతారం ఎత్తాడు. రాజులా వస్త్రాలు ధరించడంతోపాటు చేతిలో కత్తి పట్టుకుని రిపోర్టింగ్ చేశాడు. దీంతో నెటిజనులు అతడిని జోకులతో ఆడేసుకున్నారు.
మన ఇండియా తరహాలోనే పాకిస్తాన్ రిపోర్టర్లు కూడా క్రియేటీవ్‌గా వార్తలను చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్నాళ్ల కిందట పాకిస్తాన్‌కు చెందిన ‘జీ-టీవీ’ న్యూస్ రిపోర్టర్ అజాదర్ హుస్సేన్ పీకల్లోతు నీటిలోకి దిగి సమాచారం చెప్పాడు. తమ రిపోర్టర్ ప్రాణాలను ఫణంగా పెట్టి రిపోర్టింగ్ చేశాడని ఆ టీవీ చానల్ యూట్యూబ్‌లో వీడియో పెట్టింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. భారత నెటిజనులు ఆ రిపోర్టర్‌ను జోకుల వరదలో ముంచేశారు. యూట్యూబ్ కామెంట్లలో ఓ యూజర్ స్పందిస్తూ.. ‘‘ఇంకా నయం, అతడిని ఏ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడో, సెక్స్ రాకెట్ సోదాలకో పంపించకండి. వాటిని కూడా అనుభవిస్తూ సమాచారం ఇస్తాడు’’ అని కామెంట్ చేశాడు. ఒకప్పుడు ప్రజా పాట్లనే చెప్పే మీడియా ఇప్పుడు ఇలాంటి పంటకు చేస్తుంది.. ఇప్పుడు పెరిగిన పోటీ ప్రపంచంలో మేమే ఆ న్యూస్ ముందు చెప్పాలి మేమే ముందు చెప్పాలని టీఆర్పీ ర్యాటింగుల కోసం పగులుతీస్తున్నాయి..