బాబు పాదయాత్ర ఆరోగ్యానికి మంచిది: రేణుకా
posted on Oct 2, 2012 @ 4:40PM
చంద్రబాబు పాదయాత్ర ఆయన ఆరోగ్యానికి చాలా మంచిదని రేణుకాచౌదరి అన్నారు. పాద యాత్ర ద్వారా రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. తెలంగాణపై అవగాహన లేనివారే తెలంగాణ గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉందని, 'తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే' అని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ కోసం తాము చేస్తున్న ప్రయత్నాలను వారు విఫలం చేస్తున్నారని రేణుకా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే వరకు వేచి ఉండాలని ఆమె సూచించారు.