వికారాబాద్ లీడర్ ఇంట్లో రేవ్ పార్టీ..
posted on Jun 15, 2021 @ 5:09PM
ఈ మధ్య రేవ్ పార్టీలతో నాగరాలే కాదు పట్టణాలు కూడా చెలరేగిపోతున్నాయి. అంతకు ముందు హైదరాబాద్ లో.. మొన్న కడ్తాల్ లో తాజాగా వికారాబాద్ జిల్లాలో. లోకల్ లీడర్ మనవరాలి బర్త్ డే పార్టీకి ఘనంగా ఏర్పాట్లు చేశాడు. ఈ వేడుకలకు జనం భారీగా వచ్చారు. అంతేకాకుండా అర్థరాత్రి వరకు డీజేలు పెట్టి హిజ్రాలతో డాన్సులు కూడా చేశారు. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అసలే కరోనా టైం..మనుషులను భయబ్రాంతులకు గురిచేస్తుంది. మనుషులను ఆర్థికంగా కృంగదీస్తుంది..ఈ టైములో లేనోడు లేక ఏడిస్తే ఉన్నోడు తిన్నది అరగక చిందులేస్తున్నాడు. కొంత మంది కరోనా నిబంధనలు పట్టడం లేదు. కేసులు విపరీతంగా నమోదు అవుతున్నా.. జనం మాత్రం ఏ భయం లేకుండా పార్టీలు, ఫంక్షన్లు ఘనంగా చేసుకుంటున్నారు. కరోనా నిబంధనల్ని పట్టించుకోకుండా బర్త్ డే పార్టీలు, రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఓ నాయకుడు తన ఇంట్లో ఘనంగా బర్త్ డే పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీకి భారీగా అతిథుల్ని పిలవడమే కాకుండా హిజ్రాాలతో అసభ్యకర డాన్సులు కూడా వేయించాడు. దోమ మండలం దిర్సంపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిజ్రాలతో అర్ధరాత్రి సమయంలో మందు వేస్తూ చిందులు వేస్తూ రికార్డింగ్ డాన్స్లు చేయడమే కాదు దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈనెల 11వ తేదీన దిర్సింపల్లికి చెందిన పిల్లి మొగులయ్య అనే లోకల్ లీడర్ తన మనవరాలి పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోనే ఘనంగా ఏర్పాట్లు చేశాడు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి డీజేతో హంగామా సృష్టించారు. అంతేకాకుండా ఈ పుట్టినరోజు వేడుకల్లో హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశారు.
అయితే ఈ ఫంక్షన్ కి వచ్చిన దోమ మండలం పోలీసులు కూడా వచ్చారు. వారంతా భోజనం చేసి చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. అయితే ఈ పుట్టినరోజు వేడుకల్లో హిజ్రాలు చేసిన అశ్లీల నృత్యాలు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో విషయం మొత్తం బయటకు వచ్చింది. దీంతో నెటిజన్లు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.మొత్తానికి ఈ ప్రపంచం ఎటువైపు పోతుందో అర్థం కర్దవం లేదు.. చాలా మంది ఈ కోవిద్ టైం లో ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు.. ఫైన్లు వేసిన, కేసులు పెట్టిన, చివరికి పోలీసుకు లాఠీకి పని చెప్పిన ప్రజలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.. చాలా వరకు ఎంజాయ్ చేయడానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు.. కరోనా వస్తే ఉంటామో , పోతామో అనే అనుమానం మొదలైనయినట్లు ప్రజల్లో.. ప్రజలు గురించి కాసేపు పక్కన పెడితే రాజకీయ నాయకుల ఇలాంటి సంఘ విద్రోహ పనులు చెయ్యడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రజలు ఇలా ఉంటే ప్రభుత్వాలు ఇంత కంటే దారుణంగా ఉన్నాయి స్థానికులు మాట్లాడుకుంటున్నారు..