మందు తాగిన ఎలుకలు.. కంగుతిన్న అధికారులు..
posted on Jul 6, 2021 @ 12:24PM
మందు.. ఆ పేరు వింటే కొందరికి నాలుక లాగుతుంది. కొందరు పండగలకు పబ్బాలకు మాత్రమే తాగుతారు. ఇంకొందరు అప్పుడప్పుడు తాగుతారు.. మరికొందరు అయితే ఎప్పుడు పడితే అప్పుడు తాగుతారు.. కొందరికి అయితే టైం తో పని ఉండదు పొద్దునే వెళ్లి వైన్ షాప్ ముందు కూర్చుంటారు.. ఆ దుకాణం తెరవడంతోనే వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది. బెడ్ మీద పేషేంట్ కి సెలైన్ బాటిల్ ఎక్కినట్లు వాళ్లకు ఎప్పుదు మందు పొత్తనే ఉండాలి.. అందుకే వాళ్లకు ఒక పేరు ఉంది.. ఆ పేరే మందు బాబులు.. తాగుబోతులని.. మనుషులు మందు తాగడం సాధారణం. అది అనాది నుండి వస్తున్న అలవాటు.. అప్పుడపుడు తాగడం సరదా.. ఎప్పుడు తాగడం వ్యసనం..ముందుకు బానిసలు అవ్వడం.. నేటి కాలంలో మందు లేనిదే ముద్దదిగదు. చాలామందికి ఈ మందు బానిసలు అవుతున్నారు. కాసేపు ఈ మందు గోల, మానవుల గోల పక్కన పెడితే.. కొన్ని జీవరాసులు మనుషులే మందు తాగుతారా.. మేము కూడా తాగుతాం అంటున్నాయి. ఇప్పటి వరకు మందు తాగడంలో నన్ను మించినవాడు లేడు అనే మనిషికి, ఎలుక ఏకంగా సవాలు విసురుతున్నాయి. ఎలక ఏంటి ? మందు తాగడం ఏంటి ? మళ్ళీ మనిషికి సవాల్ విసరడం ఏంటి? అని అనుకుంటున్నారా మీరే చూడండి..
ఎలుకలు మద్యం తాగిన ఘటన మరోసారి వెలుగుచూసింది. కరోనా సంక్షోభం అనంతరం మద్యం దుకాణం తెరిచిన తమిళనాడు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు 12 ఖాళీ వైన్ బాటిళ్లను చూసి షాక్‌కు గురైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా గుడలూరు సమీపంలోని కదంపూజ పట్టణంలో ప్రభుత్వం మద్యం దుకాణం నడుపుతోంది. కరోనా వ్యాప్తి వల్ల విధించిన లాక్ డౌన్ తో ఈ మద్యం దుకాణాన్ని మూసిఉంచారు. దీంతో ఎలుకలు బాటిళ్ల మూతలను కొరికాయి.. వైన్ బాటిల్ లో ఉన్న వైన్ ను లాగించాయి. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దుకాణంలోని 12 క్వార్టర్ మద్యం బాటిళ్ల మూతలు ఎలుకలు కొరికి, అందులో ఉన్న మందును నీటుగా తాగమని ఎక్సైజ్ శాఖ అధికారులు కనుగొన్నారు. ఎలుకలు మద్యం తాగిన ఘటనపై సీనియర్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.