ప్రమాదాలకు అమ్మాయిలే కారణం
posted on Nov 12, 2012 @ 9:31AM
అబ్బాయిలు బైక్ నడపడం చాలా కష్టం. గేర్ మార్చాలి, క్లచ్ నొక్కాలి. బ్రేక్ తొక్కాలి.. ఈ లోగా అందమైన అమ్మాయి ఎదురుగా కనిపిస్తే బ్రేక్ జారడం చాలా కామన్.. అన్న సినిమా డైలాగ్ ని సీరియస్ గా తీసుకున్నారు చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్.. అసలు చాలా ప్రమాదాలు అందమైన అమ్మాయిలవల్లే జరుగుతున్నాయంటూ ఆయన చేసి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి.
నూటికి తొంభై శాతం ప్రమాదాలు కేవలం అమ్మాయిలు, సెల్ ఫోన్లు, బైకులవల్లే జరుగుతున్నాయని రమణ్ సింగ్ వ్యాఖ్యానించారు. వెనక గర్స్ ఫ్రెండ్ ఉంటే చాలు అబ్బాయిలకు ఒళ్లు పొంగుతుందని, ఎలా నడుపుతున్నారోకూడా తెలీని పరిస్థితుల్లో యాక్సిడెంట్లు చేస్తున్నారని కామెంట్ చేశారు. వేలుపోసి బైకులు కొనేవాళ్లు, వంద రూపాయలు పెట్టి హెల్మెట్ కొనలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అందంగా ఉన్న అమ్మాయిల్నిచూసి చొంగకార్చుకోవాల్సిన అవసరమేంటని మహిళా సంఘాలు ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిని నిలదీస్తున్నాయి. డ్రైవింగ్ చేసేవాళ్లు కంట్రోల్లో లేకపోతే అమ్మాయిలేం చేస్తారంటూ మండిపడుతున్నాయి. అందంగా పుట్టడం అమ్మాయిలకు శాపమా.. అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయ్.