రాందేవ్ ట్రస్ట్ కు రూ 5.14 కోట్ల జరిమానా

 

పన్నులు కట్టనందుకు బాబా రాందేవ్ ట్రస్ట్ కు ప్రభుత్వం కోట్ల జరిమానా విధించింది. హరిద్వార్ కు చెందిన పతంజలి యోగాపీట్ అండ్ దివ్య యోగా ట్రస్ట్ శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలనుండి డబ్బు తీసుకొంటోంది కాబట్టి ఇది వాణిజ్యం కిందికి వస్తుందని, అందుకుగాను సర్వీసు టాక్స్ కట్టాలని రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు అలాంటి పన్నులు కట్టనందుకు రూ 5.14 కోట్ల జరిమానా చెల్లించాల్సిందిగా ట్రస్ట్ కు నోటిసు ఇచ్చారు. ఈ మొత్తం 2007-08 సంవత్సరం నుంచి 2011- 12 సంవత్సరం వరకు జరిపిన లావాదేవీలకు వర్తిస్తుందని నోటిసు పేర్కొంటోంది.

Teluguone gnews banner