సినిమా ప్రొడ్యూసర్ ఆత్మహత్య
posted on Aug 31, 2012 @ 12:08PM
చేసిన అప్పులు కట్టాలేక, అప్పుఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఎం చేయాలో తెలియని పరిస్థితుల్లో కన్నడ సినిమా ప్రొడ్యూసర్ రాకేష్ జైన్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాకేష్ జైన్ బళ్లారిలో మైనింగ్ బిజినెస్ చేసి సినీ నిర్మాణ రంగంలోకి వచ్చాడు. సినిమా రంగంలోకి వచ్చిన తరువాత బిజినెస్ లాస్‌తో పాటు సినిమా ఫీల్డ్ కూడా కలిసి రాకపోవడంతో దాదాపు రూ. 20 కోట్ల వరకు అప్పులు కట్టాల్సి వచ్చింది. దీంతో రాకేష్ నిన్నబెంగుళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టు మాత్రం తరువాత రాకేష్ మృత దేహాన్ని అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.