జసాన్‌లో రజనీ సినిమా
posted on Jul 10, 2013 9:22AM
ఇండియన్ సినిమాలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే పేరు రజనీ కాంత్.. సౌత్ సూపర్ స్టార్ వెలుగొందుతున్న రజనీ ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్ పాలోయింగ్ విపరీతంగా ఉంది.. ముఖ్యం జపాన్ లాంటి దేశాల్లో రజనీ మేనియా ఓ రేంజ్‌లో ఉంది.
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ క్రేజ్ జపాన్ లో సునామీ సృష్టిస్తోంది. రజనీ పేరుతో.. జపాన్ లో ఓ సినిమా రూపొందుతోంది. అంతేకాదు జపాన్‌లో ఉన్న రజనీ ఫ్యాన్స్ అంతా కలిసి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.. అది రజనీ స్టామినా.
ది రజనీ ఎఫెక్ట్ పేరుతో ఓ ఇంగ్లీష్ సినిమా రూపొందుతోంది. ఓ జపనీయుడు సూపర్ స్టార్ అవ్వాలనే కలను నెరవేర్చుకోవడానికి ఏం చేశాడన్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రజనీ నే ఇన్సిపిరేషన్. రజనీ నిజ జీవితం ఆధారంగానే ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
యూకే బార్కింగ్ మాడ్ ప్రొడక్షన్ ఈ చిత్రానికి, లండన్ కి చెందిన నెల్సన్, కువేరా దర్శకత్వం వహిస్తున్నారు. మరో విశేషమేంటంటే.. ఇందులో కొందరు ప్రముఖ తమిళ నటులు గెస్ట్ రోల్స్ పోషిస్తున్నారట. జర్మనీలో ఈ నెల 17 నుంచి జరగనున్న పదవ స్టట్ గట్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రీమియర్ షో జరుగుతుంది.. జపాన్ లో తెరకెక్కిన రజనీ అక్కడితో పాటు ఇండియాలో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందంటున్నారు ఫ్యాన్స్..