నటి అంజలిని అరెస్టు చేస్తామని కోర్ట్ వార్నింగ్
posted on Jul 8, 2013 @ 3:57PM
సినీ నటి అంజలికి సైదాపేట కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వచ్చే నెల 12లోపు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. లేనిచో అరెస్టు వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. అంజలి మిస్సింగ్ కేసును విచారణకు స్వీకరించిన సైదాపేట్ కోర్టు ఇప్పటికే మూడు సార్లు ఆమె గైర్హాజరవడాన్ని తీవ్రంగా పరిగణించింది. మరోవైపు రెండు నెలల కిత్రం అంజలి 'మిస్సింగ్' కు సంబంధించి మద్రాస్ హైకోర్టులో మరో కేసు నడుస్తోంది. గతంలోనూ అంజలి విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కాకపోవటంతో ఆమెకు కోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. తదుపరి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. అంతే కాకుండా విచారణకు హాజరుకాని పక్షంలో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కూడా కోర్టు హెచ్చరించింది. అయినా అంజలి కోర్టు హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. మళ్లీ కోర్టుకు డుమ్మా కొట్టింది.
ఇప్పటికే నాలుగు వాయిదాలు ఆ నాలుగు సార్లు అంజలి కోర్టుకు గైర్హాజరైంది. దాంతో తదుపరి విచారణకు కోర్టుకు హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు అంజలికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పిటిషనర్ కలంజియమ్ కోర్టును కోరారు. మరోవైపు అంజలి తీరుపై ఇటీవలే మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 9లోగా కోర్టు ఎదుట హాజరు కావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.