12న ఈటీవీలో ‘రాజధాని ఫైల్స్’
posted on May 11, 2024 8:38AM
అమరావతి రైతుల ఆవేదనకు అద్దం పట్టేలా శ్రీమతి హిమబిందు సమర్పణలో, భాను దర్శకత్వంలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్ కంఠంనేని నిర్మించిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రం ఈనెల 12 ఆదివారం నాడు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది. ఒక దుర్మార్గుడు పాలకుడై రైతుల జీవితాలతో ఆడుకుంటుంటే, ఆ దుర్మార్గుడిపై తిరగబడి, రైతులు సాధించిన విజయం ఈ చిత్రం.
మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తాను చేసే ప్రచారంలో సమయభావం వల్ల ప్రతీ ఊరికి, ప్రతీ ఇంటికి నేరుగా వెళ్లలేకపోయారు!
అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్, బి.జె.పి. నాయకులు కూడా కొన్ని ప్రాంతాలకి వెళ్లలేకపోయారు..ఐనా తమ శక్తివంచన లేకుండా ప్రచారం చేశారు. వీళ్ల కూటమిని గెలిపించండని ప్రజలందరికీ చెప్పడానికి తెలుగువన్ వారి "రాజధాని ఫైల్స్" చిత్రం మాత్రం ప్రతీ ఇంటింటికీ వెళ్లి తలుపు తడుతోంది, ఇంటిలో ఉన్న ప్రతీ ఒక్కర్నీ ఆలోచింప చేయబోతోంది!
రాజధాని లేని లోటుని.. కూటమి గెలుపు అవసరాన్ని ప్రజలకి తెలియజెప్పబోతోంది, అందుకే రేపు పోలింగ్ అనగా 12వ తేది ఆదివారం
ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మీ ఈటీవీలో మీ ముందుకు వస్తోంది.!
ఎంత ధైర్యం దానికి..! ఎంత శక్తి దానికి..!
దానికి కారణం అది ప్రజా బాణం.!
కూటమి గెలుపుకి శ్రీకారం చుడుతోంది.
రాష్ట్ర భవితకు ఆకారం ఇవ్వబోతోంది..
"రాజధాని ఫైల్స్" చిత్రం.