తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
posted on Aug 27, 2024 @ 11:19AM
తెలుగురాష్ట్రాలకు భారీ వర్ష సూచన. దేశవ్యాప్తంగా 14 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన 14 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్ కూడా ఉన్నాయి.
భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటలకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్న వాతావరణ శాఖ ఈ 14 రాష్ట్రాలకూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించాయి.