కేటీఆర్ ఫామ్‌హౌస్ ఖాళీ.. ఇక కూల్చుకోండి!
posted on Aug 27, 2024 @ 12:20PM
హైదరాబాద్ నగరానికి చెందిన జంట జలాశయాల నిషేధిత ప్రాంతంలో నిర్మించిన కేటీఆర్ ఫామ్‌హౌస్ కూల్చివేతకు సంబంధించిన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ నాది కాదు.. నా మిత్రుడిది అని ప్రకటించారు. అతిక్రమణలు వుంటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తాను అని కూడా చెప్పారు. ఫామ్ హౌస్ ఓనర్‌గా చెబుతున్న ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తికి కోర్టు నుంచి రిలీఫ్ ఏమీ లభించలేదు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫామ్‌హౌస్‌ని ఏరోజైనా కూలగొట్టొచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఇక చేయగలిగింది ఏమీ లేకపోవడంతో, సదరు ఫామ్‌హౌస్‌లోని సామాను మొత్తాన్నీ కేటీఆర్ అక్కడ నుంచి తరలించినట్టు సమాచారం. లోపల ఇంద్రభవనంలా వుండే ఫామ్‌హౌస్‌లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన చాలా సామాను వుంది. ఆ సామాను మొత్తాన్నీ అక్కడ నుంచి మెదక్ జిల్లాలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ ఫామ్ హౌస్‌లో పూచిక పుల్ల కూడా లేకుండా మొత్తం తరలించేశారు. కూల్చివేతకు కేటీఆర్ మానసికంగా సిద్ధపడే ఖాళీ చేసినట్టు తెలుస్తోంది. ఇక హైడ్రాకి లైన్ క్లియర్‌గా వుంది. కూల్చేయడమే మిగిలివుంది.