ప్లాట్ ఫాం ఫై చెత్తేసారా, 500 ఫైన్

 

 

 

 

అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రైల్వే అధికారులు రోజుకొక విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇటీవలే, స్లీపర్ క్లాస్ తరగతుల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా ఏదేని గుర్తింపు కార్డు కలిగిఉండాలనే నిభందన ప్రవేశపెట్టిన అధికారులు ప్రస్తుతం మరో నిభందన ప్రవేశపెట్టారు.

 

ఇక నుండి ఫ్లాట్ ఫాం ఫై కాగితాలు పారేసినా, చెత్త వేసినా రూ. 500 జరిమానా కట్టాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లలో పరిశుభ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు రైల్వే బోర్డు ఓ ప్రకటనలో తెలియచేసింది. ఇప్పటి వరకూ చెత్త వేసినా వెంటనే రైల్వే సిబ్బంది వచ్చి పరిశుభ్రం చేసేవారు. ఇక నుండి ఫ్లాట్ ఫాం ఫై బట్టలు ఉతికినా, స్నానాలు చేసినా, వంట వండుకున్నా, రైల్వే స్టేషన్లో వ్యాపార ప్రకటనలు అంటించినా మీరు రూ. 500 ఫైన్ కట్టాల్సిందే. రైల్వే స్టేషన్ మాస్టర్, టిటిఈ లకు ఈ జరిమానా వసూలు చేసే అధికారాన్ని అప్పగించారు.

 

మొదటగా, తత్కాల్ టికెట్ తీసుకున్న వారికి మాత్రమే గుర్తింపు కార్డు నిభందన ఉండేది. ఆ తర్వాత ఎసి తరగతుల్లో ప్రయాణించేవారికి కూడా ఈ గుర్తింపు కార్డు నిభందనను వర్తింపచేశారు. ఇలా, రైల్వే అధికారులు అదనపు ఆదాయానికి తహతహలాడుతున్నట్లు అగుపిస్తోంది.

Teluguone gnews banner